Site icon vidhaatha

Manchu Lakshmi| ప్లీజ్ నాకు సాయం చేయండంటూ బ్ర‌తిమిలాడుతున్న మంచు ల‌క్ష్మీ.. అంత క‌ష్టం ఏమోచ్చింది..!

Manchu Lakshmi| న‌టిగా, నిర్మాత‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైంది మంచు ల‌క్ష్మీ. కెరీర్‌లో నిల‌దొక్కుకునేందుకు గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తుంది. త‌న‌పై ఎవ‌రు ఎన్ని విమ‌ర్శ‌లు చేసిన కూడా అవ‌న్నీ ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతుంది. రీసెంట్‌గా వరలక్ష్మీ శరత్ కుమార్ రిసెప్షన్ వేడుకల్లో సందడి చేసిన సంగతి తెలిసిందే. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మంచు ల‌క్ష్మీ.. చాలా రోజుల త‌ర్వాత చెన్నైలో మిత్రుల‌తో క‌లిసి ఎంజాయ్ చేశాన‌ని, చాలా ఆనందని తెలిపింది. ఇక తాజాగా త‌న‌కు వ‌చ్చిన క‌ష్టం గురించి నెటిజ‌న్స్‌తో పంచుకుంది. సాయం కావాలని కోరుతూ పోస్ట్‌ పెట్టింది. మ‌రి ఇంతకి మంచు ల‌క్ష్మీకి వ‌చ్చిన స‌మ‌స్య ఏంటంటే.. ఈవిడ‌ అమెరికాకి వెళ్లేందుకు నిర్ణయించుకుంది.

తన కూతురు చదువు నేపథ్యంలో ఆమె అమెరికా వెళ్లాల్సి ఉందట. అయితే వీసా అప్రూవ్‌ అయినా కూడా అది ఇంత వ‌ర‌కు త‌న చెంత‌కు చేర‌కు రాకపోవ‌డంతో ఆవేద‌న వ్యక్తం చేసింది. సాయం కోసం ఎదురు చూసి నిరాశ చెందాను. నెల క్రితమే నా వీసాను అమోదించిన‌ప్ప‌టికీ ఇప్పటి వరకు అది నాకు చేరలేదు. నా కూతురు సెలవులు కూడా పూర్తి అయ్యాయి. జూలై 12న నేను విమానం ఎక్సాల్సి ఉండ‌గా, ఎంబసీ వెబ్‌సైట్ డౌన్ కావడంతోవారిని సంప్రదించడానికి వీలు లేకుండా పోయింది.ఇప్పటికే రెండు నెలలు దాటింది. దయచేసి ఈ విషయంలో నాకు ఎవరైనా సాయం చేయగలరా? అంటూ మంచ‌క్క భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు రాయబారి ఎరిక్‌ గార్సెట్టి ఇనిస్ట్రా ఖాతాలనూ ట్యాగ్‌ చేస్తూ తన పరిస్థితి వివరించారు.

అయితే దీనిపై నెటిజ‌న్స్ ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌ తీసుకుని నేరుగా ఎంబసీకి వెళ్లండంటూ కొంద‌రు స‌లహాలు ఇస్తుండ‌గా, అక్కా అలా నిలదీస్‌ఫై అంటూ మ‌రో నెటిజ‌న్ ట్వీట్ చేశాడు. ఇంకొక‌డు సేమ్ మా సమస్య కూడా ఇదే అని మంచు ల‌క్ష్మీ ట్వీట్‌కి రిప్లై ఇచ్చాడు. ప్ర‌స్తుతం మంచు ల‌క్ష్మీకి నెటిజ‌న్స్ ప‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు అయితే చేస్తున్నారు. ఇక సినిమాల పరంగా చూసుకుంటే మంచు లక్ష్మీ చివరగా ఓటీటీలో యక్షిణి అంటూ కనిపించింది. యక్షిణిలో ఓ ముఖ్య పాత్రను పోషించి ఆకట్టుకుంది. ఆదిపర్వం అనే మరో సినిమాతో మంచు లక్ష్మీ తెరపైకి రానుంది.

Exit mobile version