MAnchu Lakshmi| మంచు మోహన్ బాబు తనయగా ఇండస్ట్రీకి వచ్చిన మంచు లక్ష్మీ ఆనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. నటిగా, హోస్ట్‌గా, నిర్మాతగా కూడా అదరగొట్టింది. ఈ మధ్య తెలుగులో మంచు లక్ష్మి సందడి అంతగా లేదు. మొన్నటి వరకు వరుసగా సినిమాలు చేసిన మంచు లక్ష్మీకి తెలుగులో ఆఫర్స్ రాకపోవడంతో తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది. ఇక సడెన్‌గా ముంబైకి మకాం మార్చింది. ఇక అక్కడికి వెళ్లినప్పటి నుండి ఆమె సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది. హాట్ హాట్ లుక్స్‌తో అదరగొట్టింది. ఇక తాజాగా ఆమె బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. తన కెరీర్‌కు తన కుటుంబమే అడ్డుపడుతుందంటూ ఊహించని కామెంట్స్ చేసింది. అంతేకాదు స్టార్ కిడ్ అయినా సౌత్‌లో ఆఫర్స్ రావడం అంత ఈజీ కాదు అని మంచక్క తెలియజేసింది.
మంచు లక్ష్మి మాట్లాడుతూ… నేను ముంబై వచ్చిన కొత్తలో నా స్నేహితురాలు రకుల్ ప్రీత్ ఇంట్లో ఉన్నాను. ఆమె ముంబై వచ్చేయ్ అని తరచూ చెప్పేది. అలాగే రానా కూడా నువ్వు ఎందుకు ఎప్పుడూ హైదరాబాద్ లోనే ఉండిపోతావు? అని అనేవాడు. ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని ముంబై వచ్చాను. మన సౌత్‌లో చూస్తే హీరోల కూతుళ్లకు, సిస్టర్స్ కి పెద్దగా అవకాశాలు రావు. అసలు నేను నటిని కావడం మా నాన్నకి ఏ మాత్రం ఇష్టం లేదు. నా ఇద్దరు సోదరులకి సులభంగా దక్కినవి నాకు దక్కడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. పితృస్వామ్య వ్యవస్థలో నేను కూడా బాధితురాలినే అంటూ మంచు లక్ష్మీ పేర్కొంది. అయితే ఈ ధోరణి సౌత్ లోనే కాదు, దేశమంతా కూడా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది మంచు వారమ్మాయి.
మాది చాలా పెద్ద కుటుంబం. అందరం కలిసి ఉండేవాళ్లం. ఇంట్లో ఆడపిల్లని నేను ఒక్కదానినే కావడం వలన నాపైన ప్రత్యేక ఫోకస్ ఉంటుంది. మా నాన్న అయితే నేను ఎక్కడికి వెళ్లిన అస్సలు ఒప్పుకునేవారు కాదు. మొదట నేను ముంబైకి వెళతానంటే అదొక పెద్ద చెరువు అని, అందులో నువ్వు ఈదలేవు అంటూ నన్ను భయపెట్టించేవారు. లేనిపోని అపోహలతో వారు భయపడ్డారు. నేను ఏం చేస్తానన్న కూడా వారు భయంతో వద్దనేవారు. అయితే నాకు ఎదైనా కొత్తగా ట్రై చేయాలి అనిపించేది. అలా ముంబైకి షిఫ్ట్ అయ్యాను అని మంచు లక్ష్మీ పేర్కొంది. ప్రకాశ్ కోవెలమూడి నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ మా నాన్న (మోహన్ బాబు), అతని నాన్న (రాఘవేంద్ర రావు) అది జరగకుండా చూడటానికి ఎంతో ప్రయత్నించారు అంటూ మంచు లక్ష్మీ పేర్కొనడం గమనర్హం.