Klin kaara| క్లింకార వ‌చ్చిన వేళా విశేషం.. మెగా ఫ్యామిలీ ఇంట అన్నీ శుభాలే..!

Klin kaara| మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఆయ‌న స‌తీమ‌ణి ఉపాస‌న పెళ్లైన ప‌ద‌కొండేళ్ల‌కి క్లింకార అనే చిన్నారికి జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. ఆ పాప‌కి క్లింకార అని నామ‌క‌ర‌ణం చేశారు. పుట్టిన‌ప్ప‌టి నుండి పాప ఫేస్ బ‌య‌ట‌కు క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు మెగా ఫ్యామిలీ. అయితే క్లింకార ఫేస్ ఇప్ప‌టి వ‌ర‌కు

  • Publish Date - June 5, 2024 / 07:15 PM IST

Klin kaara| మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఆయ‌న స‌తీమ‌ణి ఉపాస‌న పెళ్లైన ప‌ద‌కొండేళ్ల‌కి క్లింకార అనే చిన్నారికి జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. ఆ పాప‌కి క్లింకార అని నామ‌క‌ర‌ణం చేశారు. పుట్టిన‌ప్ప‌టి నుండి పాప ఫేస్ బ‌య‌ట‌కు క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు మెగా ఫ్యామిలీ. అయితే క్లింకార ఫేస్ ఇప్ప‌టి వ‌ర‌కు రివీల్ చేయ‌క‌పోయిన ఆ పాప మెగా ఫ్యామిలీకి అదృష్ట దేవ‌త‌గా మారిందని చెబుతున్నారు. మెగా మనవరాలు పుట్టిన తరువాతే ఆ ఇంట అన్ని శుభాలు జ‌రుగుతున్నాయి. క్లింకార అలా పుట్టిన వెంట‌నే చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌లిసి న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు రెండు ఆస్కార్లు వచ్చాయి. ఇప్పటి వ‌ర‌కు తెలుగు సినిమా ఆస్కార్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూడ‌గా, అది చ‌ర‌ణ్ న‌టించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో సాధ్యం కావ‌డం విశేషంగా చెప్పుకోవాలి.

ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్‌గా కూడా ఎదిగాడు. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ న‌ట‌న‌ని చాలా మంది ప్ర‌శంసించారు.ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్‌కి ఎన్నో స‌త్కారాలు కూడా జ‌రిగాయి. ఏకంగా ఆస్కార్ జ్యూరీలో మెంబర్ గా కూడా ప్లేస్ కొట్టేశాడు. అయితే స్వ‌యంకృషితో చ‌ర‌ణ్‌కి అంత‌ర్జాతీయంగా పేరు ద‌క్కిన కూడా చాలా మంది ఇది మెగా మ‌న‌వ‌రాలు వ‌చ్చిన వేళావిశేషం అంటున్నారు. ఇక మెగా ఫ్యామిలీకి చెందిన మ‌రో హీరో అల్లు అర్జున్ జాతీయ అవార్డ్ అందుకున్నాడు. గ‌తంలో ఎప్పుడు కూడా టాలీవుడ్ కు చెందిన న‌టుడు ఎవ‌రు బెస్ట్ హీరో క్యాటగిరీలో అవార్డ్ రాలేదు.. ఇన్నేళ్ళ తెలుగు సినీ ఇండస్ట్రీ లో మొద‌టి సారిగా ఉత్త‌మ న‌టుడు క్యాట‌గిరీలో జాతీయ అవార్డ్ సాధించి స‌త్తా చాటాడు బ‌న్నీ. ఈ విష‌యంలో కూడా క్లింకార లక్కీ లెగ్ ప‌ని చేసింద‌ని అంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే రెండోవ అత్యున్నత పురస్కారం ఇటీవ‌ల అందుకున్నాడు. గతంలో పద్మభూషణుడు అయిన చిరంజీవి విశ్వంభరుడుగా.. పద్మవిభూషణుడిగా క్లింకార వ‌చ్చాక‌ మారారు. ఇక గ‌త ప‌దేళ్లుగా రాజ‌కీయాల‌లో విజయం కోసం ప‌వ‌న్ పరితపిస్తుండ‌గా, క్లింకార పుట్టాక ఆయ‌న మంచి విజ‌యం సాధించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ 21 స్థానాల‌లో పోటీ చేయ‌గా, 21 స్థానాల‌లో గెలిచింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్ట‌బోతున్నారు. ఇన్ని శుభాలు వారి వారి కృషితో పాటు..మెగాఫ్యామిలీలో క్లింకార అడుగు పెట్టిన తరువాతే జరుగుతున్నాయి. దాంతో క్లింకార మెగా ఫ్యామిలీ అదృష్ట దేవత అంటున్నారు ఫ్యాన్స్.

Latest News