OPPO A6k | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో కొత్తగా OPPO A6k 5G మొబైల్‌ను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. 7000mAh భారీ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పాటు మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. మిడిల్ రేంజ్ కస్టమర్లే టార్గెట్‌గా తీసుకొచ్చిన ఈ ఫోన్‌కు చైనాలో మంచి క్రేజ్ లభిస్తోంది.
ఎండలోనూ క్లియర్ విజిబిలిటీ!
ఒప్పో A6k స్మార్ట్‌ఫోన్ 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రీఫ్రెష్ రేట్, 240Hz సాంప్లింగ్ రేట్‌తో స్మూత్ అనుభవాన్ని అందిస్తుంది. ఇక 1,125 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుండటంతో ఎండలోనూ క్లియర్ విజిబిలిటీ ఉండనుంది. పనితీరు విషయానికి వస్తే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్+256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుండగా.. గరిష్టంగా 12జీబీ ర్యామ్+512జీబీ స్టో్రేజీ ఆప్షన్ల వరకు ఉన్నాయి.
50MP ప్రధాన కెమెరా.. 10x డిజిటల్ జూమ్
కెమెరా విషయానికి వస్తే.. ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో 50మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్ కలిగిన డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. ప్రధాన కెమెరా 10x డిజిటల్ జూమ్ వరకు సపోర్టు చేస్తుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు.
పవర్‌ఫుల్ బ్యాటరీ.. ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్
Oppo A6k మొబైల్ 7000mAh భారీ బ్యాటరీతో వస్తుంది. ఇది 45W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వస్తుంది. దీనివల్ల చాలా తొందరగా ఫోన్ చార్జింగ్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ పరంగా 5G, Wifi 5, Bluetooth 5.4 ఫీచర్లు ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సదుపాయం కూడా అందించారు. ఈ మొబైల్ IP66, IP68, IP69 రేటింగ్‌లతో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌గా వస్తుంది.
ధర ఎంతంటే..!
ఇక ధర విషయానికి వస్తే.. చైనాలో 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజీ వేరియంట్ ధరను 1999 చైనీస్ యువాన్స్‌గా నిర్ణయించారు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.27వేలుగా ఉంది. 8జీబీ ర్యామ్+512జీబీ స్టోరేజీ ధర 2199 చైనీస్ యువాన్స్ (సుమారు రూ.29వేలు), 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజీ వేరియంట్ ధర 2399 చైనీస్ యువాన్స్ (రూ.32వేలు)గా ఉంది.
భారత్‌లోకి ఎప్పుడొస్తుందో!
ప్రస్తుతం ఈ మొబైల్ చైనా మార్కెట్‌లో అందుబాటులో ఉంది. కానీ భారత్‌లోకి ఏ మొబైల్ ఎప్పుడు తీసుకొస్తారనే దానిపై ఒప్పో కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ మిడ్ రేంజ్‌లో భారీ బ్యాటరీ, మంచి పనితీరు కోరుకునే కస్టమర్లకు Oppo A6k 5G స్మార్ట్‌ఫోన్ మంచి ఎంపికగా నిలుస్తోందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read More:
OPPO F33 | ఎండలో ఉన్నా.. కింద పడ్డా సేఫ్‌గా ఉండే మొబైల్.. రూ.35వేలలోనే తీసుకొస్తున్న ఒప్పో
