Site icon vidhaatha

Vishwambhara | సంక్రాంతి బరిలో నుంచి మెగాస్టార్‌ ‘విశ్వంభర’ అవుట్‌.. రిలీజ్‌ వాయిదాకి అసలు కారణం అదేనటా..?

Vishwambhara | మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంభర. ప్రస్తుతం మూవీ షూటింగ్‌ కొనసాగుతున్నది. వాస్తవానికి ఈ మూవీని ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్‌ భావించారు. అయితే, తెలుగు సినిమాకు సంక్రాంతి కీలకమైన సీజన్‌. దాంతో ప్రతి హీరో సంక్రాంతి రేసులో నిలవాలని భావిస్తుంటారు. దాంతో ఏటా సంక్రాంతికి గట్టిపోటీనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి ‘విశ్వంబర’ సైతం సంక్రాంతి రేసులో నిలిచింది. జనవరి 10న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్‌ ప్రకటించారు. తాజాగా విశ్వంబర సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్నట్లు తెలుస్తున్నది. ఈ మూవీ సోషియో ఫాంటసీ జానర్‌లో తెరకెక్కుతున్నది. అనుకున్న సమయానికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ పూరయ్యే అవకాశం లేదని.. పెండింగ్‌ పనులు ఉన్నాయి. అలాగే, ఓటీటీ రైట్స్‌ విషయంలోనూ ఒప్పందం కుదరలేని టాక్‌. దాంతో చిత్రాన్ని సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవాలని మేకర్స్‌ భావిస్తున్నారని సమాచారం.

త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వశిష్ట మల్లిడి ఈ మూవీకి దర్శకుడిగా పని చేస్తుండగా.. యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్నది. చిరంజీవి సరసన త్రిష కృష్ణన్‌ నటిస్తున్నది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత మెగాస్టార్‌తో త్రిష జతకడుతున్నది. అలాగే, ఆషికా రంగనాథ్‌, రమ్య పసుపులేటి, ఈషాచావ్లా, మీనాక్షి చౌదరి, సురభి పురాణిక్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో చిరు దొరబాబు అనే పాత్రలో కనిపిస్తారని.. త్రిష ఈ మూవీలో ద్విపాత్రాభినయం చేయనున్నది తెలుస్తున్నది. సాధారణ కన్యగా, దేవకన్యగా కనిపించనున్నది సమాచారం. మూవీలో రెండుపాత్రల్లో త్రిష గ్లామర్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని.. చిరు – త్రిష జోడీ తెరపై అభిమానులను ఆకట్టుకుంటుందని తెలుస్తున్నది. మిగతా హీరోయిన్లు చిరుకు చెల్లెళ్లుగా నటిస్తారని సమాచారం.

Exit mobile version