ఈ సారి బిగ్ బాస్ షో రసవత్తరంగానే నడుస్తుంది..ఇప్పటికే 50 రోజులకు పైగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్(Bigg boss) ఎప్పటికప్పుడు కొత్తగానే కనిపిస్తోంది. అంతే కాదు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. గేమ్ అంతా తారుమారు కావడం జరిగింది. ఇక బిగ్ బాస్ హౌజ్‌ని ఇప్పటి వరకు 8 మంది వీడారు. ఇక ఈ రోజు మరొకరు ఎలిమినేట్ కాబోతున్నారు. అందుకు సంబంధించి అనేక ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఈ వారం నామినేషన్స్‌లో మొత్తంగా ఆరుగురు నామినేట్ అయ్యారు. వారిలో నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని ఉన్నారు. వీరిలో నామినేషన్స్ పూర్తయినప్పటి నుంచి బిగ్ బాస్ ఓటింగ్‌లో ప్రేరణ టాప్‌లో కొనసాగుతూ ఉండగా, నిఖిల్ రెండో స్థానం, విష్ణుప్రియ మూడో స్థానంలో ఉంది.
ఇక నాలుగో స్థానంలో పృథ్వీ ఉంటే.. ఐదు, ఆరు స్థానాల్లో మెహబూబ్, నయని ఉన్నారు. డేంజర్ జోన్‌లో ఉన్న మెహబూబ్, నయని స్థానాలు మారుతూ వస్తుండడం ఇప్పుడు ఆసక్తికరంఆ మారింది.ఆదివారం ఎలిమినేషన్‌కి సంబంధించిన షూటింగ్ శనివారమే పూర్తి కావడంతో మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడని కొందరు చెబుతుండగా, లేదు లేదు నయని పావని ఎలిమినేట్ అయిందని ఇంకొందరు అంటున్నారు. మెహబూబ్ కంటే నయనికి తక్కువ ఓట్లు పడటంతో.. ఆమె బిగ్ బాస హౌస్ ను వీడి బయటకు వచ్చేసిందనే ఓ టాక్ ఉంది. మరోవైపు మెహబూబ్ హౌజ్‌లోకి వచ్చిన రెండు రోజులకు నబీల్‌తో కమ్యూనటీపై చర్చ పెట్టాడు. తమ కమ్యూనిటీ వాళ్లంతా వారిద్దరికే ఓట్లు వేస్తారు అని, ఇద్దరిలో ఏ ఒక్కరు నామినేషన్స్‌లో ఉన్న ఓట్లు గుద్దుతారని, ఇద్దరు నామినేట్(Nomination) కాకుండా చూసుకోవాలని మెహబూబ్ చెప్పాడు.
మెహబూబ్, నబీల్ మాట్లాడిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో మెహబూబ్‌పై తీవ్రమైన నెగెటివిటీ ఎర్పడింది. అందుకే ఆ తర్వాతి వారమే నామినేషన్స్‌లోకి వచ్చిన మెహబూబ్‌కు ఓట్లు పడలేదని తెలుస్తోంది.అయితే అందరూ ఈ వీక్ విష్ణు ప్రియ(Vishnu Priya) బయటకి వెళ్ళిపోతుందేమో అనుకున్నారు. కాని విష్ణు ప్రియ ఓటింగ్ లో మూడో ప్లేస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇప్పుడైనా విష్ణు ప్రియ గేమ్ పై దృష్టిపెట్టి టాప్ 5లోకి వెళ్లాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.