తెలుగునాట మరో ఆసక్తికరమైన కాంబినేషన్ పట్టాలెక్కింది. అయితే ఇది అలాంటి ఇలాంటి కాంబో కాదు చాలా అరుదుగా జరిగేది. అందుకు వేదికైంది నాని కొత్త చిత్రం. గతంలో నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన దసరా చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో ఇటీవల ఓచిత్రం ఎనౌన్స్ చేసి షూటింగ్ కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి పారడైజ్ అని పేరు ఫిక్స్ చేసినట్లు ఇప్పటికే తెగ ప్రచారం జరుగుతుంది. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించనుండగా ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు నటించనున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ఇప్పటికే మోహన్‌బాబులో చర్చలు జరిపినట్లు విలన్ పాత్రకు అంగీకరించినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రను రెగ్యులర్ తరహాలో కాకుండా చాలా విభిన్నంగా చూయించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలాఉండగా ఈ వార్త నిజమైతే టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ వస్తుందని, మోహన్ బాబుకు మంచి రోజులు రావడంతో పాటు, ఆయనేంటో , ఆయన ప్రతిభ ఏంటో కూడా నేటి తరాలకు కూడా తెలుస్తుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.