Mokshagna| మోక్ష‌జ్ఞ కోసం క‌త్తి లాంటి హీరోయిన్‌ని సెట్ చేసిన బాల‌య్య‌.. ప్లానింగ్ మాములుగా లేదుగా..!

Mokshagna| టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో నంద‌మూరి ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ ఫ్యామిలీ నుండి ఏదైన హీరో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెడుతున్నాడంటే అత‌ని రాక కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. గ‌త కొంత కాలంగా మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ గురించి నెట్టింట అనేక ప్ర‌చారాలు సాగ‌గా, ఎట్ట‌కేల‌కి క్లారిటీ వ‌చ్చింది. రీసెంట్‌గా త‌న సోష‌ల్ మీడియా ద్వారా డెబ్యూ మూవీ గురించి క్లారిటీ ఇచ్చాడు.త‌న లేటెస్ట్ పిక్

  • Publish Date - July 5, 2024 / 06:45 AM IST

Mokshagna| టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో నంద‌మూరి ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ ఫ్యామిలీ నుండి ఏదైన హీరో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెడుతున్నాడంటే అత‌ని రాక కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. గ‌త కొంత కాలంగా మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ గురించి నెట్టింట అనేక ప్ర‌చారాలు సాగ‌గా, ఎట్ట‌కేల‌కి క్లారిటీ వ‌చ్చింది. రీసెంట్‌గా త‌న సోష‌ల్ మీడియా ద్వారా డెబ్యూ మూవీ గురించి క్లారిటీ ఇచ్చాడు.త‌న లేటెస్ట్ పిక్ ఒక‌టి షేర్ చేసి వ‌స్తున్నా అంటూ కామెంట్ చేశాడు. అయితే మోక్ష‌జ్ఞ గ‌తంలో చాలా లావుగా..బొద్దుగా షేప్ అవుట్ అయి ఉండే వాడు . కాని రీసెంట్ లుక్‌లో మాత్రం స్లిమ్ గా, ఫిట్ గా.. డిపరెంట్ హెయిర్ స్టైల్ తో.. హ్యాండ్సమ్ గా క‌నిపించాడు. దీంతో నంద‌మూరి అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

మోక్షజ్ఞ డెబ్యూ చిత్రాన్ని హ‌నుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తారని టాక్. ఈ యంగ్ డైరెక్టర్ చేతుల మీదుగా మోక్షజ్ఞను లాంఛ్ చేస్తే బావుంటుందని బాలయ్య భావిస్తున్నారట. మరోవైపు మోక్షజ్ఞని డైరెక్టర్ అనిల్ రావిపూడి లాంచ్ చేస్తారంటూ జోరుగా ప్ర‌చారాలు సాగిన‌, ఆరంగేట్రం మూవీని యువ దర్శ‌కుడికి ఇవ్వాల‌ని బాల‌య్య డిసైడ్ అయ్యార‌ట‌. ఇక మోక్ష‌జ్ఞ కోసం క‌త్తిలాంటి హీరోయిన్‌ని కూడా సెట్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రచ్చ చేస్తున్న శ్రీలీలని మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీకి హీరోయిన్‌గా ఫైన‌ల్ చేశాడ‌ని ఇండ‌స్ట్రీ టాక్.

గ‌తంలో శ్రీలీల‌… బాలయ్య బాబుతో క‌లిసి భగవంత్ కేసరి సినిమాలో నటించింది. ఆ స‌మ‌యంలో శ్రీలీలలో టాలెంట్ ను గుర్తించిన బాలయ్య.. తన కొడుకు మోక్షజ్ఞ పక్కన శ్రీలీల అయితే కరెక్ట్ గా సూట్ అవుతుంది అని ఈమెని ఫైన‌ల్ చేశాడ‌ని ఓ టాక్ న‌డుస్తుంది. మ‌రి దీనిపై కూడా త్వ‌ర‌లోనే ఓ క్లారిటీ అయితే రానుంది. ఇక మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీలో నంద‌మూరి బాల‌య్య కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. వీట‌న్నింటిపై త్వ‌ర‌లోనే ఓ క్లారిటీ రానుంది.

Latest News