Site icon vidhaatha

త్వరలో పెళ్లి.. కానీ పిల్లలను కనను: మృణాల్ ఠాకూర్

విధాత : సినీ నటి మృణాల్ ఠాకూర్ పెళ్లి..పిల్లలను కనడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని, కాని పిల్లలను కనే ఆలోచన మాత్రం లేదని చెప్పారు. అయితే ఎగ్ ఫ్రీజింగ్ పద్దతిలో పిల్లలను కనడంపై భవిష్యత్తులో ఆలోచన చేస్తానన్నారు. తెలుగులో సీతారామం సినిమా హిట్‌తో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ ఇటీవల హాయ్ నాన్న..ఫ్యామిలీ స్టార్ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. కెరియర్ పిక్ స్టేజ్‌కు చేరుతున్న దశలో ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా చేసిన వ్యాఖ్యలు ఆమె అభిమానులకు ఒకింత నిరాశను కల్గించేలా ఉన్నాయి.

అలాగే ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా పిల్లలను కనడంపై ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ మధ్య కాలంలో చాలామంది అమ్మాయిలు ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు త్వరగా పెళ్లి చేసుకుని తల్లులు కావడానికి ఆసక్తి చూపడం లేదు. పెళ్లి, పిల్లలను రకరకాల కారణాలతో వాయిదా వేస్తున్నారు. అయితే కొంత వయసు తర్వాత మహిళల్లో అండోత్పత్తి నాణ్యత తగ్గిపోతుంది. ఆ తర్వాత పిల్లలు కనాలన్నా కష్టమే. అలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా కెరీర్ ఓరియెంటెడ్ యువతులు తమ అండాలను ఓసైట్ క్రయోప్రిజర్వేషన్ పద్ధతిలో భద్రపరచుకునే అవకాశం ఉంది. యువతులు తమ అండాలను ఈ పద్ధతిలో భద్రపరుచుకుని, వారు తల్లి కావడానికి సిద్ధపడిన సమయంలో వాటిని ఫలదీకరించి గర్భాశయంలో ప్రవేశపెట్టడం ద్వారా సంతానం పొందుతారు.

Exit mobile version