Site icon vidhaatha

Nagma | బాలీవుడ్‌ నటుడితో ప్రేమాయణం నగ్మా ప్రేమాయణం.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నదట..?

Nagma | సీనియర్‌ హీరోయిన్‌ నగ్మా గురించి పరిచయం అవసరం లేదు. తెలుగులో స్టార్‌ హీరోయిన్‌. గ్లామర్‌లో ఏ హీరోయిన్‌ పోటీ ఇచ్చేవారు కారు. డేట్స్‌ కోసం హీరోలు, నిర్మాతలు సైతం రోజుల తరబడి నిరీక్షించేవారని టాక్‌. అయితే, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌తో పాటు సీనియర్‌ హీరోలందరితో నటించింది. రీల్‌ లైఫ్‌లో సక్సెస్‌ హీరోయిన్‌గా నిలిచినా.. రియల్‌ లైఫ్‌లో మాత్రం సక్సెస్‌ కాలేకపోయింది. ఐదుపదుల వయసు మీదపడుతున్నా ఇప్పటి వరకు పెళ్లి ఊసెత్తలేదు. అయితే, పలువురు స్టార్స్‌తో డేటింగ్‌ చేసిందనే టాక్‌ ఫిల్మ్‌ సర్కిల్‌లో వార్త చక్కర్లు కొట్టాయి. టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌర్‌ గంగూలీతో ప్రేమాయణం కొనసాగించిందని.. ఆ తర్వాత ఇద్దరూ కొన్నాళ్లు సహజీవనం చేశారని టాక్‌. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారట. అప్పటికే గంగూలీకి పెళ్లి అయ్యింది. తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనుకోగా.. ఈ విషయం గంగూలీ భార్యకు తెలియడంతో పెళ్లిని నిర్ణయాన్ని గంగూలీ రద్దు చేసుకున్నాడట.

ఆ తర్వాత నగ్మాకు శరత్‌ కుమార్‌తో పరిచయమై.. ప్రేమగా మారింది. శరత్‌ కుమార్‌ ఏకంగా నగ్మా కోసం సినిమాలు సైతం నిర్మించారట. నగ్మాతో తిరుగుతున్న విషయం భార్యకు తెలియడంతో గొడవలు జరిగాయి. ఏమైందో తెలియదు కానీ శరత్‌ కుమార్‌ తన భార్యతో విడాకులు తీసుకున్నారు. అప్పటికే శరత్‌ కుమార్‌, నగ్మాకి గ్యాప్ రాగా.. ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. మళ్లీ నగ్మాకు రవికిషన్‌తో పరిచయం కాగా.. కొద్దిరోజులు లివింగ్‌ రిలేషన్‌లో ఉన్నారు. ఏవో మనస్పర్దలు రావడంతో దూరమయ్యారు. కొద్దిరోజులకు భోజ్‌పూరీ స్టార్‌ మనోజ్‌ తివారికి దగ్గరైంది. ఆయనతోనూ గొడవలో దూరమయ్యారు. నలుగురితో ప్రేమాయణం నడిపిన నగ్మా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం నగ్మా ఓ బాలీవుడ్‌ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నట్లు టాక్‌ వినిపిస్తుంది. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తున్నది. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందనేది తెలియదు.

Exit mobile version