Namratha| సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన నమ్రత ఆ తర్వాత యాడ్స్ చేసి అనంతరం సినిమాలలోకి వచ్చింది. ఎయిర్ హోస్టెస్ కావాలనే కోరిక తనకి ఉన్నా కూడా తల్లికి నచ్చకపోవడంతో మోడలింగ్ వైపు వెళ్లి సక్సెస్ అయింది.. 1993లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్, ఫెమినా మిస్ ఇండియా ఏషియా పసిఫిక్ అందాల పోటీల్లో టైటిల్ విన్నర్‌గా నిలిచింది. ఇలా కొన్నాళ్లపాటు అందాల పోటీల్లోనే పాల్గొంది. ఆ తర్వాత 1998లో మేరే దో అన్మోల్ రతన్ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నమ్రత ఆ తర్వాత హిందీతో పాటు తెలుగు, మలయాళ భాషలలో సినిమాలు చేసింది.
ఇక 2000లో టాలీవుడ్ మహేష్ బాబు సరసన వంశీ చిత్రంలో నటించింది. ఈ సినిమా ఫ్లాపైన వారి ప్రేమకి బీజం వేసింది వంశీ చిత్రం.ఇక వంశీ తర్వాత పలు సినిమాలలో నటించి మెప్పించింది. చివరిగా 2004లో సినిమా చేసిన నమ్రత మళ్లీ అటు వైపు దృష్టి పెట్టలేదు. మహేష్ బాబు భార్య అయినా సింపుల్ గా ఉండటానికి నమ్రత ఇష్టపడతారు. మహేష్ సినిమాలు సక్సెస్ కావడానికి నమ్రత తన వంతు కృషి చేస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. నమ్రత.. మహేష్‌కి సంబంధించిన అన్ని పనులు చూసుకుంటుంది. మహేష్‌ని ప్రసన్నం చేసుకోవాలి అంటే ముందుగా నమ్రతని ప్రసన్నం చేసుకోవాలనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.
ఇక గత రెండు రోజులుగా టాలీవుడ్‌లో నమ్రత గురించి ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది. నమ్రత శిరోద్కర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారట. ఆమె ఓ చిత్రానికి సైన్ చేశారని, ప్రముఖ ఫ్యామిలీకి చెందిన యంగ్ హీరో మూవీలో నమ్రత కీలక రోల్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది. ఇందులో నమ్రత నెగెటివ్ షేడ్స్‌తో ఉన్న పాత్రలో కనిపించనుందని అంటున్నారు. అయితే నమ్రత రీఎంట్రీ ఇవ్వబోవు మూవీ మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అనే టాక్ కూడా ఉంది. బాలయ్య, మహేష్ బాబు మధ్య మంచి బాండింగ్ ఉండడంతో నమ్రత ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. త్వరలోనే పూర్తి క్లారిటీ అయితే రానుంది.