Site icon vidhaatha

Nani | ఆ దర్శకుడితో నాని మరో సినిమా.. సాయిపల్లవి, కీర్తి సురేశ్‌లో ఛాన్స్‌ ఎవరికి..?

Nani | న్యాచురల్‌ స్టార్‌ నాని ‘దసరా’ సినిమా తర్వాత ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’లో నటిస్తున్నాడు. అనంతరం సుజిత్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడు. ‘సరిపోదా శనివారం’ నిర్మాతలే సుజిత్‌ సినిమాను సైతం నిర్మించేందుకు ప్లాన్‌ చేసినా.. బడ్జెట్‌ విషయంలో ఇంకా లెక్కలు తేలలేదని సమాచారం. మరో వైపు నాని మరోసారి ‘దసరా’ మూవీ దర్శకుడు శ్రీకాంత్‌ ఒదెలతో మరో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇద్దరి కాంబినేషనల్‌ మరో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. దసరా నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఇది పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించనున్నట్లు టాక్‌. అయితే, ఈ మూవీలో హీరోయిన్‌గా మళ్లీ కీర్తి సురేశ్‌ను తీసుకుంటారా? కొత్తగా మరో హీరోయిన్‌గా తీసుకుంటారా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. కీర్తి సురేశ్‌ కాకపోతే ఆ ఛాన్స్‌ని సాయిపల్లవికి ఇవ్వాలని భావిస్తున్నారని టాక్‌. సాయి పల్లవి, కీర్తి సురేష్ ఇద్దరిలో ఎవరు చేసినా సరే.. ఇద్దరికి అది హ్యాట్రిక్‌ సినిమా కాబోతున్నది. సాయి పల్లవితో నాని ఎంసీఏ, శ్యామ్‌ సింగరాయ్‌లో నటించాడు. ఇక క్తీరితో నేను లోకల్‌, దసరా మూవీల్లో చేశాడు. ప్రస్తుతం శ్రీకాంత్‌ ఒదెల డైరెక్టర్‌ చేసే ఈ మూవీలో ఇద్దరిలో ఎవరిని హీరోయిన్‌గా తీసుకుంటారనే చర్చ సాగుతున్నది. ఇద్దరిలో ఎవరిని హీరోయిన్‌గా తీసుకున్నా వారికి నానితో హ్యాట్రిక్‌ సినిమా కాబోతున్నది.

Exit mobile version