Sreemukhi|టీవీ షోల‌లోను పెరిగిపోతున్న నాన్సెన్స్.. ద‌గ్గ‌రుండి చేయిస్తుండ‌డంతో శ్రీముఖిని తిట్టిపోస్తున్న నెటిజ‌న్స్

Sreemukhi| ఒక‌ప్పుడు సినిమాల‌లో మాత్ర‌మే కాస్త హాట్ హాట్ సీన్స్, అందాలు ఆర‌బోయ‌డం వంటి ఉండేవి. కాని ఇప్పుడ‌ది బుల్లితెర‌కి కూడా పాకింది. ఇష్ట‌

  • Publish Date - April 24, 2024 / 04:20 PM IST

Sreemukhi| ఒక‌ప్పుడు సినిమాల‌లో మాత్ర‌మే కాస్త హాట్ హాట్ సీన్స్, అందాలు ఆర‌బోయ‌డం వంటి ఉండేవి. కాని ఇప్పుడ‌ది బుల్లితెర‌కి కూడా పాకింది. ఇష్ట‌మోచ్చిన‌ట్టు చిందులు వేయ‌డం, తెగ గ్లామ‌ర్ షో చేస్తూ కుర్రాళ్ల‌కి కిక్ అందించే ప్ర‌య‌త్నం చేయ‌డం, డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌తో నానా ర‌చ్చ చేయ‌డం ఇప్పుడు ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయి. చిన్న యాంక‌ర్స్ నుండి స్టార్ యాంక‌ర్స్ వ‌ర‌కు కూడా త‌మ షోలలో ఏదో ర‌కంగా ర‌చ్చ చేస్తూ అంద‌రి అటెన్ష‌న్ త‌మ వైపుకు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ యాంకర్స్‌లో ఒక‌రిగా శ్రీముఖి ఉంది. ఆమె ఒక‌వైపు షోలు చేస్తూ అడ‌పాద‌డ‌పా సినిమాల‌లో కూడా న‌టిస్తూ అల‌రిస్తుంది. అయితే శ్రీముఖి ఇటీవ‌ల ఓటీటీలోకి కూడా అడుగుపెట్టింది.

ప్ర‌ముఖ‌ ఒటీటీలో కామెడీ షోకి హోస్ట్ చేస్తుండ‌గా, ఇందులో శ్రీముఖి తీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఓ షోలో నిర్వ‌హించిన ఫ‌న్నీ టాస్క్ చాలా వ‌ల్గ‌ర్‌గా ఉంద‌ని, ఇలాంటి షోని నువ్వు ఎలా హోస్ట్ చేస్తున్నావు అంటూ శ్రీముఖికి లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకుతున్నారు. ఇలాంటి షోలు ఇంట్లో వాళ్ల‌తో క‌లిసి ఎలా చేస్తాం, కొంచెం అయిన ఆలోచించ‌రా అంటూ తిట్టిపోస్తున్నారు. అయితే షోలలో గేమ్స్ పేరుతో హగ్గింగ్, కిస్సింగ్ వంటి వల్గర్ యాక్టివిటీస్ న‌టీన‌టుల‌తో చేయిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అలాంటి గేమ్ ఒక‌టి శ్రీముఖి ఆడించింది.

ఇందులో బిగ్ బాస్ ఫేమ్ రవికృష్ణ‌తో పాటు మ‌రో నటి కూడా పాల్గొన‌గా, ఈ గేమ్ రూమ్ ప్ర‌కారం లేడీ ఆర్టిస్ట్ బెలూన్ తీసుకువచ్చి రవికృష్ణ ల్యాప్ లో పెట్టి దానిపై కూర్చొని ప‌గ‌ల‌గొట్టాలి. ఇది కాస్త వ‌ల్గ‌ర్‌గా ఉండ‌డంతో ప్ర‌తి ఒక్కరు తిట్టిపోస్తున్నారు. టీవీ షోల వేదిక‌గా ఇంకెన్నాళ్లు ఇలాంటి చెత్త ప‌నులు అంటూ తిట్టిపోస్తున్నారు. రాను రాను బుల్లితెర షో స్థాయి దిగ‌జారిపోతుంద‌ని అంటున్నారు. శ్రీముఖి కూడా ఇలాంటి షోలు ఒప్పుకోవడం దారుణాతి దారుణం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక‌నైన కాస్త మంచి షోలు చేయాల‌ని సూచిస్తున్నారు. ఇక శ్రీముఖి విష‌యానికి వ‌స్తే ఆమె అల్లు అర్జున్ -అట్లీ కాంబోలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ ద‌క్కించుకుంద‌ని స‌మాచారం. బుల్లితెర‌పై స్టార్ మా పరివార్, నీతోనే డాన్స్ 2.0, ఆహా లో స్టాండప్ కామెడీ షో చేస్తుంది.

Latest News