Niharika| అత‌నితో నిహారిక డేటింగ్.. తెగ ముద్దుల వ‌ర్షం కురిపించేసిందిగా..!

Niharika| నాగబాబు ముద్దుల కూతురు నిహారిక గురించి ప్ర‌త్యేక పరిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఎంతో మంది ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకుంది. ఇటీవల ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. విడాకులు తీసుకున్న తరువాత మళ్లీ ఇండస్ట్రీలో యాక్టీవ్ అవడానికి నిహారిక అనేక ప్ర‌య

  • Publish Date - June 2, 2024 / 11:45 AM IST

Niharika| నాగబాబు ముద్దుల కూతురు నిహారిక గురించి ప్ర‌త్యేక పరిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఎంతో మంది ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకుంది. ఇటీవల ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. విడాకులు తీసుకున్న తరువాత మళ్లీ ఇండస్ట్రీలో యాక్టీవ్ అవడానికి నిహారిక అనేక ప్ర‌యత్నాలు చేస్తుంది. అయితే నిహారిక వ్యక్తిగ‌త జీవితంలో విడాకుల విష‌యం అంద‌రిని భాదింప‌జేసింది. చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. అయితే భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేక మ‌ధ్య‌లోనే అత‌డికి బ్రేక‌ప్ చెప్పింది. ఏవో కార‌ణాల వ‌ల‌న ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లైన సంవత్సరానికి భర్తకు విడాకులిచ్చి షాకిచ్చింది.

నిహారిక ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంది. త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి సంబంధించిన అనేక విష‌యాలు షేర్ చేస్తూ అల‌రిస్తుంది. తాజాగా త‌న తండ్రితో మినీ డేట్‌కి వెళ్లిన‌ట్టు తెలియ‌జేసింది.జనసేన పార్టీ కోసం కష్టపడ్డ తండ్రి నాగబాబును మినీ డేట్‌కు తీసుకువెళ్లింది నిహారిక. ఈ విషయాన్ని తెలుపుతూ.. ఓ క్యూట్ వీడియోను విడుదల చేసింది. ఇందులో నిహారిక తండ్రికి ముద్దులు పెడుతూ తన ప్రేమను చూపించింది. అయితే నిహారికకు నాగబాబు అంటే ఎంత ఇష్టమో, నాగ‌బాబుకి నిహారిక కూడా అంతే ఇష్టం. తాజాగా ఒక‌రిపై ఒక‌రు చూపించుకుంటున్న ప్రేమ‌ని చూసిన నెటిజన్లు తండ్రి, కూతురు ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

విడాకుల త‌ర్వాత నిహారిక కెరియ‌ర్‌పై పూర్తి దృష్టి పెట్టింది. పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూనే.. సొంత బ్యానర్‌లో సినిమాలను కూడా నిర్మిస్తోంది. ..మంచు మనోజ్‌ పక్కన హీరోయిన్‌గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. మనోజ్ నటించే ”వాట్ ది ఫిష్” అనే సినిమాలో నిహారిక హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. మ‌రోవైపు నిహారిక ఇత‌ర భాష‌ల‌లో కూడా సినిమాలు చేసేందుకు ఆస‌క్తి చూపుతుంది.

Latest News