Site icon vidhaatha

Bigg Boss8|ల‌వర్ విష‌యంలో ఫైట్.. కొడ‌తావా అంటూ మీద‌మీద‌కి..!

Bigg Boss8|గ‌త బిగ్ బాస్ సీజన్స్ క‌న్నా ఈ సీజ‌న్‌లో ల‌వ్ ఎఫైర్స్ కాస్త డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తున్నాయి.ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీస్ ప్రేక్ష‌కుల‌కి మంచి మ‌జా కూడా అందిస్తున్నాయి. అయితే తొమ్మిదో వారం టాస్క్ లతో హీటెక్కించాడు బిగ్‌ బాస్‌. ఇన్నాళ్లు రెండు క్లాన్‌లుగా ఉన్న బిగ్‌ బాస్‌ హౌజ్‌ని ఒక్కటి చేశాడు. రాయల్‌ క్లాన్‌, ఓజీ క్లాన్‌లను కలిపి బిగ్‌ బాస్‌ మెగా క్లాన్‌ గా మార్చేసిన బిగ్ బాస్‌(Bigg Boss). ఈ క్లాన్‌ కోసం మెగా చీఫ్‌ అయ్యేందుకు ప‌లు టాస్క్‌లు ఇచ్చాడు. ఈ మేరకు హౌజ్‌మేట్స్ ని నాలుగు టీమ్‌లుగా విడగొట్టాడు. టీమ్ రెడ్‍లో యష్మి గౌడ (కెప్టెన్), గౌతమ్ కృష్ణ, ప్రేరణ – బ్లూ టీమ్‍లో హరితేజ (కెప్టెన్), అవినాశ్, నిఖిల్ – గ్రీన్ టీమ్‍లో నబీల్ (కెప్టెన్) టేస్టీ తేజ, విష్ణు ప్రియ – ఎల్లో టీమ్‍లో పృథ్వి (కెప్టెన్) రోహిణి, నయని ఉన్నారు. ఇటీవల తీవ్రంగా గొడవ పడిన పృథ్వి, రోహిణి ఒకే టీమ్‍లో ఉన్నారు.

మొద‌టి ఛాలెంజ్ పేరు మంచి మ‌నిషి. ఇందులో ఇచ్చిన వివిధ వస్తువులు ఉపయోగించి జట్టుకు సంబంధించిన స్నో మ్యాన్‍ను పూర్తి చేయాలని చెప్పారు. ముందుగా స్నో మ్యాన్‍ను పూర్తి చేసిన జట్టు విజేత అని, ఆ జట్టు కెప్టెన్‍కు రెండుసార్లు డైస్ రోల్ చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ ఫస్ట్ చాలెంజ్‍లో హరితేజ కెప్టెన్సీలోని బ్లూ టీమ్ గెలిచింది. ఎల్లో కార్డును యష్మి టీమ్‍కు ఇచ్చారు హరితేజ. దీంతో ఎందుకు అని యష్మి(Yashmi) ప్రశ్నించారు. రెండు ఎల్లో కార్డులు వచ్చిన టీమ్ నుంచి ఓ కంటెస్టెంట్ ఔట్ అవుతారనే రూల్ పెట్టారు బిగ్‍బాస్.ఆ తర్వాత పానిపట్టు యుద్ధం పేరుతో రెండో ఛాలెంజ్ ఇచ్చారు బిగ్‍బాస్. నాలుగు టీమ్‍లు వారి ట్యాంకుల్లో నీరు తక్కువగా ఉండకుండా చూసుకోవాలన్నారు. ఈ టాస్క్ లో నిఖిల్‌.. రెడ్‌ టీమ్‌ని టార్గెట్‌ చేశాడు.

సంచాలక్‌ చెప్పిన వినకుండా వాళ్లని బాగా డిస్టర్బ్ చేశాడు. ఈ క్రమంలో నిఖిల్‌పై యష్మి ఫైర్‌ అయ్యింది. సంచాలక్‌ నిర్ణయాన్ని పాటించడం లేదని ఆమె మండిపడింది. దాంతో గౌతమ్‌ రియాక్ట్ అయ్యాడు. డిస్టర్బ్ చేసిన విధానం బాగా లేదని, కరెక్ట్ కాదని ఫైర్‌ అయ్యారు. అమ్మాయిలతో అలాగేనా చేసేది అంటూ నిఖిల్‍పై ఫైర్ అయ్యారు. నిఖిల్‍(Nikhil)పై యష్మి కూడా కోప్పడ్డారు. సంచాలక్ ఆపాలన్నా అలాగే తోడయం కరెక్ట్ కాదంటూ అరిచారు. రూల్ ఫాలో చేయడం లేదని అన్నారు. ఓవర్ యాక్టింగ్ చేయవద్దని కామెంట్ చేశారు నిఖిల్. దీంతో “నువ్వు చేసిందే ఓవర్ యాక్టింగ్” అని గౌతమ్ అరిచారు. ఏంది.. ఏంది అంటూ ఒకరిపై ఒకరు దూసుకొచ్చారు. కొట్టుకునేంత పని చేశారు. బీప్‍లు మాట్లాడొద్దు.. దమ్ముంటే ఇటు రా అంటూ నిఖిల్ కూడా ముందుకు వచ్చారు. కొడతావా అంటూ ఇద్దరూ వాదులాడుకున్నారు. “నువ్వు ప్రవర్తించిన తీరు రాంగ్” అంటూ గౌతమ్ అరిచారు. తిట్టించుకొని ఊరికే కూర్చోవాలా అంటూ నిఖిల్ గేమ్ మధ్యలోనే వెళ్లిపోయారు. మొత్తానికి య‌ష్మీ బాయ్ ఫ్రెండ్స్ అయిన నిఖిల్‌, గౌత‌మ్ మ‌ధ్య ఇంత బిగ్ ఫైట్ కావ‌డం ఆస‌క్తి రేపింది.

Exit mobile version