NTR| ఓటు హ‌క్కు వినియోగించుకున్న అల్లు అర్జున్, ఎన్టీఆర్..ఓట‌ర్ల‌కి విజ్ఞ‌ప్తి

NTR| తెలుగు రాష్ట్రాల‌లో ఓటింగ్ ప్ర‌క్రియ మొద‌లైంది. ఉద‌యం 7గం.ల‌కి పోలింగ్ మొదలు కాగా, జ‌నాలు భారీ ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు..పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలివస్తుండ‌డం శుభ‌సూచికంగా చెప్పుకోవ‌చ్చు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఎన్నిక‌ల అధికా

  • Publish Date - May 13, 2024 / 08:29 AM IST

NTR| తెలుగు రాష్ట్రాల‌లో ఓటింగ్ ప్ర‌క్రియ మొద‌లైంది. ఉద‌యం 7గం.ల‌కి పోలింగ్ మొదలు కాగా, జ‌నాలు భారీ ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు..పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలివస్తుండ‌డం శుభ‌సూచికంగా చెప్పుకోవ‌చ్చు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఎన్నిక‌ల అధికారులు అన్ని ర‌కాల ఏర్పాట్లు చేశారు. వీఐపీ జోన్‌గా పరిగణించే జూబ్లీహిల్స్‌లో కూడా ఓట‌ర్లు బారులు తీరారు. సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు, వ్యాపార‌వేత్త‌లు లైన్‌లో నిలుచొని మ‌రీ ఓటు హ‌క్కు వినియోగించుకుంటున్నారు.

ఇక పాన్ ఇండియా స్టార్లు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి, తల్లితో కలిసి వెళ్లి జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఉన్న పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మీడియాతో మాట్లాడిన ఎన్టీఆర్ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల‌ని తెలియ‌జేశారు. ఇది మనం రాబోయే తరాలకు అందించాల్సిన మంచి సందేశమని నేను భావిస్తున్నాను అంటూ పేర్కొన్నారు.

ఇక అల్లు అర్జున్ సైతం ఉద‌యాన్నే పోలింగ్ బూత్‌కి వెళ్లి తమ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. అల్లు అర్జున్‌ అయితే బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌తి ఒక్క‌రు కూడా మీ అమూల్య‌మైన ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌ల‌ని కోరారు. ఓటు వేయ‌డం పౌరులందరి భాద్య‌త‌. ప్ర‌జ‌లు ఎక్కువ మంది వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ సారి భారీ ఓటింగ్ ఉంటుంద‌ని భావిస్తున్నాను. నాకు ఏ రాజ‌కీయ పార్టీతో సంబంధం లేదు అని కూడా అల్లు అర్జున్ అన్నారు.

Latest News