Site icon vidhaatha

NTR | జూనియ‌ర్ ఎన్టీఆర్ బ‌రువు పెర‌గ‌కుండా ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తున్నారో తెలిస్తే దిమ్మ‌తిరిగిపోద్ది..!

NTR: జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరుకి తెలుగు రాష్ట్రాల‌లో ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తాతకు తగ్గ మనవడిగా నందమూరి నట వారుస‌డిగా జూనియర్ ఎన్టీఆర్ తన అద్భుతమైన నటన కౌశలంతో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకుంటున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్..స్టూడెంట్ నంబర్1, ఆది, సింహాద్రి సినిమాల విజయంతో అగ్ర‌హీరోల జాబితాలో చేరాడు. ఎన్టీఆర్ న‌టుడిగానే కాకుండా హోస్ట్‌గా కూడా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నాడు. అయితే ఎన్టీఆర్.. అశోక్, రాఖీ సినిమాల‌లో ఎంత బొద్దుగా ఉండేవారో మ‌నం చూశాం. ఆ స‌మ‌యంలో ఆయ‌న‌పై చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

రాజ‌మౌళి సైతం లావు త‌గ్గితేనే ఎన్టీఆర్ తో సినిమా చేస్తాన‌ని అన్నాడ‌ట‌. దీంతో ఆయ‌న ఫుడ్ విష‌యంలో ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ య‌మ‌దొంగ స‌మ‌యానికి బ‌రువు త‌గ్గాడు.ఎంతో క‌ష్ట‌ప‌డి వెయిట్ త‌గ్గిన జూనియర్.. మళ్లీ పెరగకుండా ఉండడం పైన కూడా ప్ర‌త్యేక దృష్టి సారించారు. ఎన్టీఆర్ వెయిట్ తగ్గినప్పటి నుంచి ప్ర‌త్యేక‌మైన‌ డైట్ ఫాలో అవుతున్నాడని ఆ కారణంగానే అత‌ని బాడీలో ఏ మాత్రం మార్పు రాలేదని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది..ప్రతిరోజు జూనియర్ ఎన్టీఆర్ లేచిన వెంటనే యోగా గాని లేదంటే రెండు గంటలపాటు వర్క‌వుట్స్ చేస్తారని చెప్తున్నారు. ఆ త‌ర్వాత ఉదయం రెండు గ్లాసుల రాగి జావా తాగి, . ఆపైన నానబెట్టిన బాదం పప్పు వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటార‌ట‌.

ఫ్రూట్ జ్యూస్ తార‌క్ ఎక్కువ తీసుకుంటార‌ని టాక్. మధ్యాహ్న భోజనంలో ఆయ‌న‌ కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువగా ఉండేలా రాగి సంకటి, లేదా నాటుకోడి తింటారట. ఇక రాత్రి స‌మ‌యంలో నానబెట్టిన మొలకలు వచ్చిన తృణధాన్యాలు మాత్రమే తింటార‌ట‌. ఇక రోజులో ఎప్పుడు ఆకలిగా అనిపించినా కేవలం ఫ్రూట్ జ్యూస్ లతోనే త‌న కడుపు నింపుకుంటారు అని టాక్. ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహార ప‌దార్ధాలు, డీప్ ఫ్రై చేసే ఆహారాలు ఎన్టీఆర్ అస్సలు ముట్టుకోరని , ఇక కఠినంగా డైట్, ఎక్సర్సైజులు చేస్తూ ఉండ‌డం వ‌ల్ల‌నే జూనియర్ ఇలా స్లిమ్‌గా కనిపిస్తున్నాడ‌ని అంటున్నారు.

Exit mobile version