NTR| యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ క్రేజ్ దేశ వ్యాప్తంగా పాకింది. అంతేకాదు ఇప్పుడు తెలుగుతో పాటు హిందీ సినిమాలపై కూడా దృష్టి పెట్టాడు ఎన్టీఆర్. వార్2లో కీలక పాత్ర చేస్తన్న ఎన్టీఆర్ ఆ తర్వాత హిందీలో హీరోగా ఒక స్ట్రైట్ మూవీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవర అనే చిత్రం మొదలు పెట్టాడు. గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24న విడుదల చేయాలని అనుకుంటున్నారు.రెండు పార్ట్‌లుగా మూవీ తెరకెక్కుతుండగా, తొలి పార్ట్ విడుదలైన కొన్ని నెలలకి రెండో పార్ట్ రిలీజ్ చేయనున్నారు.
అయితే ఎన్టీఆర్ ఆసక్తికరమైన లైనప్ తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమయ్యాడు. 2018లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత ఎన్టీఆర్ పూర్తిగా RRR సినిమాకే అంకితమయ్యారు. ఈ మూవీ విడుదలైన తర్వాత దేవర చిత్రంకి చేస్తూనే మధ్యలో కొన్ని డేట్స్ హిందీలో ‘వార్ 2’ చిత్రానికి కేటాయించారు. ఇక రీసెంట్‌గా ప్రశాంత్ నీల్ తో కొత్త సినిమా ప్రారంభించారు. మైత్రీ మూవీ మేకర్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగానే సెట్స్ పైకి తీసుకెళ్లబోతారని తెలుస్తుంది. దీనికి ‘డ్రాగన్’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లుగా చాలా రోజులుగా టాక్ వినిపిస్తోంది.
అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఉన్న వివరాలని బట్టి చూస్తుంటే 1969 గోల్డెన్ ట్రయాంగిల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే పీరియడ్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ అనే ఆలోచనల కలుగుతుంది. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక ‘దేవర పార్ట్-1’ ను 2024 సెప్టెంబర్ 27వ తేదీన భారీ స్ధాయిలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వార్ 2 చిత్రాన్ని చిత్రాన్ని 2025 ఆగస్ట్ 15న విడుదల చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే దేవర పార్ట్ 2 వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అంటే వచ్చే ఏడాది బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులని అలరించడానికి ఎన్టీఆర్ గట్టిగానే ఫిక్స్ అయ్యాడని అర్ధమవుతుంది.