OTT| ఈ వారం ఓటీటీలో ఏకంగా 20కి పైగా సినిమాలు/ వెబ్ సిరీస్‌లు

OTT| ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోరుకునే ప్రేక్ష‌కులు కొత్త వారం వ‌స్తే ఎలాంటి సినిమాలు, వెబ్ సిరీస్‌లు వ‌స్తుంటాయా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ మధ్య కాలంలో గమనిస్తే థియేటర్లలో విడుదలైన సినిమాలన్నీ ఓటీటీలోకి రావడానికి ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. వాస్తవానికి థియేటర్లలో రిలీజ్ అయిన చిత్రాలు ఓటీటీలోకి అందుబాటులోకి రావాలంటే కనీసం నెల రోజులపైనే సమయం పడుతుంది. కానీ కొన్ని సార్లు మాత్రం థియేట్రికల్ రన్​ ఆధారంగా త్వరగానే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పలు ఇంట్రెస్టింగ్ సినిమా సిరీస్​లన్నీ త్వరగానే ఓటీటీలోకి వచ్చేశాయి