OTT Release : ఓటీటీలోకి జాన్వీకపూర్..అనుపమ సినిమాలు

సిద్ధార్థ్‌ మల్హోత్రా, జాన్వీ కపూర్‌ల ‘పరమ్‌ సుందరి’ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి వచ్చింది. అనుపమ నటించిన ‘కిష్కింధపురి’ అక్టోబర్ 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది.

janhvi-kapoor-param-sundari-anupama-parameswaran-kishkindhapuri-ott-release

విధాత : సిద్ధార్థ్‌ మల్హోత్రా, జాన్వీ కపూర్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘పరమ్‌ సుందరి’ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ అయ్యింది. తుషార్‌ జలోటా దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్‌ కామెడీ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకువచ్చి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన (రూ.349) ఇది అందుబాటులోకి వచ్చింది.

17 నుంచి ఓటీటీలోకి ‘కిష్కింధపురి’

బెల్లకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కిష్కింధపురి’ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్‌ థ్రిల్లర్‌ సెప్టెంబర్ 12న విడుదలై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. జీ5 వేదికగా అక్టోబర్ 17 సాయంత్రం 6 నుంచి ఈ సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్‌ కానుంది. అలాగే అక్టోబర్‌ 19 సాయంత్రం జీ టీవీలో దీన్ని ప్రదర్శించనుండటం గమనార్హం.