Pavitra Lokesh| హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన నరేష్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆయన కెరీర్ మొదలు కాగా, అనంతరం హీరో అయ్యాడు. కామెడీ, రొమాంటిక్ హీరోగా నరేష్ అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. శ్రీవారికి ప్రేమలేఖ, రెండు జెళ్ళసీత, జంబలకడి పంబ, ఆమె వంటి చిత్రాలు నరేష్ కి పేరు తెచ్చి పెట్టాయి. హీరోగా ఫేడ్ అవుట్ అయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సక్సెస్ అయ్యాడు. నరేష్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు పవిత్రా లోకేష్. వీరి ప్రేమ వ్యవహారం దక్షిణ భారతదేశంలో అత్యంత పాపులర్ కాగా, నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి చేసిన గొడవ కూడా అంతకుమించి పాపులర్ అయింది.
అయితే నరేష్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో నాగేశ్వర్ గారూ.. తమ బేబీ, బుజ్జి ఎటో వెళ్లిపోయిందని, అది లేకుండా తాను అన్నం కూడా తినలేనని, అకస్మాత్తుగా తనను వదిలి వెళ్లిపోయిందని, అన్నిచోట్లా తిరిగి, అందరినీ కనుక్కున్నానని, కానీ బేబీ ఎవరో తెలియదంటూ హేళన చేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకున్నారు. అయితే ఇది `వీరాంజనేయులు విహారయాత్ర` సినిమా ప్రమోషన్ కోసం అర్ధమైంది. ఈ సినిమా ఆగస్ట్ 14న ఈటీవీ విన్‌లో రిలీజ్ కానుంది. ఈక్రమంలో రీసెంట్‌గా టీజర్ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. సినిమా టీజర్ ఈవెంట్ కి గెస్ట్ గా పవిత్రా లోకేష్ వచ్చారు. టీజర్ ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
నరేష బేబీ పోయిందని తెగ బాధపడ్డారు. ఆ బేబీని వెతికి పట్టుకుని వచ్చాను. చాలా కష్టపడి ఇక్కడి వరకు తీసుకొచ్చాను. ఇక దాన్ని కాపాడుకునే బాధ్యత మీదే అంటూ చెప్పుకొచ్చింది పవిత్ర లోకేష్. అంతేకాకుండా నరేష్‌ని ఆకాశానికి ఎత్తేసింది. నరేష్ ఒక ఫైనెస్ట్ యాక్టర్ అని , ఏదైన పాత్రవస్తే దాన్ని చిన్న పిల్లాడిలా తీసుకుని నేర్చుకుని చేస్తాడని తెలియజేసింది. నరేష్ ఎలాంటి పాత్ర చేసినా అందులో జీవిస్తాడు. బాగా చేయాలని తపన పడుతుంటాడు. ఆయనతో పార్ట్ కావడం ఆనందంగా ఉంది. ఈ స్క్రిప్ట్ విషయంలోనూ ఆయన ఎగ్జైటింగ్‌గా ఉన్నాడు అని పవిత్ర తెలియజేసింది. ఇక నరేష్ తన బేబి బెంగుళూరు హైవేపై దాబా వద్ద ఉందని, లోపల పవిత్ర రాగిముద్ద నాటుకోడి తింటుందని, ఆసమయంలో మత్తు మందు పెట్టి తీసుకొచ్చినట్టు చెప్పి అందరిని నవ్వించారు.