Pawan Kalyan- Karthi | తిరుమల లడ్డూల వ్యవహారం హీరో కార్తీ క్షమాపణలు చెప్పడంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందించారు. ప్రస్తుతం యావత్ దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూల వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంమైంది. అయితే, సినిమా కార్యక్రమంలో తమిళ నటుడు కార్తీ లడ్డూల విషయంలో సెటైర్లు వేశారు. సత్యం సుందరం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. యాంకర్ కార్తీతో మాట్లాడుతూ లడ్డు కావాలా నాయన అని ప్రశ్నించింది. దీనికి కార్తీ స్పందిస్తూ లడ్డూల టాపిక్ వద్దని.. సెన్సిటివ్ టాపిక్ అంటూ నవ్వడం కనిపించింది. అయితే, దీనిపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్తీ చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. నటుడిగా కార్తీ అంటే తనకు గౌరవముందని, లడ్డూ విషయంలో చేసిన కామెంట్లు మాత్రం సరికాదంటూ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కార్తీ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. కార్తీ ట్వీట్‌పై పవన్ కల్యాణ్ స్పందించారు.
కార్తీ స్పందించిన తీరును, సంప్రదాయాలపై చూపిన గౌరవాన్ని అభినందిస్తున్నానన్నారు. తిరుపతి, శ్రీవారి లడ్డూల తదితర విషయాలు పవిత్రకు సంబంధించిన అంశాలని.. కోట్లాది మంది భక్తుల భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయన్నారు. దాంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. దీనికి వెనుక ఎలాంటి లేకుండా దీన్ని కార్తీ దృష్టికి తీసుకురావాలనుకున్నానని.. లడ్డూపై వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితి అనుకోకుండా వచ్చిందని తాను అర్థం చేసుకున్నానన్నారు. పబ్లిక్ ఫిగర్స్‌గా తమ బాధ్యత ఐక్యత, గౌరవాన్ని పెంపొందించడమేననన్నారు. ప్రత్యేకించి మనం ఎక్కువగా ఆరాధించే వాటి గురించి, మన సంస్కృతి, ఆత్మిక విలువల గురించి బాధ్యతను పెంచాలని భావిస్తున్నట్లు, సినిమా ద్వారా ఈ స్ఫూర్తిని పొందుతూనే ఈ విలువలను పెంపొందించడానికి ఎల్లప్పుడూ కృషి చేద్దామని పవన్ పిలుపునిచ్చారు. అంకితభావం, ప్రతిభతో సినిమాని మరింత సుసంపన్నం చేస్తున్న నటుడు కార్తీ అని.. ఆయన పట్ల తన అభిమానాన్ని సైతం తెలియజేస్తున్నానన్నారు. సత్యం సుందరం సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కార్తీ, సూర్య, జ్యోతికలకు ఆల్ దిబెస్ట్ చెప్పారు.
Dear @Karthi_Offl garu,
I sincerely appreciate your kind gesture and swift response, as well as the respect you’ve shown towards our shared traditions. Matters concerning our sacred institutions, like Tirupati and its revered laddus, carry deep emotional weight for millions of…
— Pawan Kalyan (@PawanKalyan) September 24, 2024