Kalki 2898 AD | ప్రభాస్‌ ‘కల్కి ఏడీ 2898’ నటించే లక్కీ ఛాన్స్‌ మిస్‌ చేసుకున్న బ్యూటీ..! ఆ హీరోయిన్‌ ఎవరో తెలుసా..?

Kalki 2898 AD | పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా.. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన మూవీ కల్కి 2898 ఏడీ. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మూవీ పాజిటివ్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ దూసుకుపోతున్నది. జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం ఇప్పటికే రూ.500కోట్లకుపైగా కలెక్షన్స్‌ని రాబట్టింది. అయితే, ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

  • Publish Date - July 2, 2024 / 11:00 AM IST

Kalki 2898 AD | పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా.. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన మూవీ కల్కి 2898 ఏడీ. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మూవీ పాజిటివ్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ దూసుకుపోతున్నది. జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం ఇప్పటికే రూ.500కోట్లకుపైగా కలెక్షన్స్‌ని రాబట్టింది. అయితే, ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో నటించే అవకాశాన్ని టాలీవుడ్‌ హీరోయిన్‌ వదులుకుందని తెలుస్తున్నది. ఈ బ్యూటీ ఎవరో కాదు బుట్టబొమ్మ పూజాహెగ్డే. ఈ మూవీలో దీపికా పదుకొనే నటించిన విషయం తెలిసిందే. ఆమెది కీలకమైన పాత్ర. సుమతిగా కల్కిని తన గర్భంలో మోస్తుంటుంది.

సినిమా స్టోరీ మొత్తం ఆమె చుట్టూ తిరుగుతుంటుంది. ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ పాత్రలో నటించే ఛాన్స్‌ వస్తే పూజా హెగ్డే వదులుకుందని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతున్నది. సుమతి పాత్ర కోసం మొదట పూజా హెగ్డేని తీసుకోవాలని మేకర్స్‌ భావించి.. సంప్రదించగా తిరస్కరించినట్లు టాక్‌. దాంతో ఆ అవకాశం దీపికా పదుకొనేను వరించింది. ఇక మూవీలో ఆమె ప్రెగ్నెంట్‌గా ఉండి నటించడం.. సుమతి పాత్రలో ఆమె నటనపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. ప్రస్తుతం పూజా ఈ పాత్ర చేసినా దీపికా పాత్రలో చూడలేకపోయేవారమని.. మూవీకి మైనస్‌ అయ్యి ఉండేదని ప్రభాస్‌ అభిమానులు పేర్కొంటున్నారు. తెలుగులో ఆచార్య మూవీలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ఎఫ్‌-3లో స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది. అప్పటి నుంచి తెలుగులో డైరెక్ట్‌ మూవీలో నటించలేదు.

సల్మాన్‌ ఖాన్‌ హీరోగా వచ్చిన ‘కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌’ మూవీలో కనిపించింది. ప్రస్తుతం హిందీలో ‘దేవా’లో నటిస్తున్నది. గతంలో టాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా కొనసాగిన పూజా హెగ్డేకు ప్రస్తుతం అవకాశాలు కరువయ్యాయి. అయితే, ఇటీవల సూర్యా మూవీలో ఛాన్స్‌ వచ్చిందని వార్తలు వచ్చినా.. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉండగా.. ప్రభాస్‌తో పూజా చివరిసారిగా రాధేశ్యామ్‌ మూవీలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇందులో పూజా నటనపై ట్రోల్స్‌ వచ్చాయి. అయితే, ఇటీవలకాలంలో పూజా నటించిన పలు సినిమాలు డిజాస్టర్‌గా నిలిచాయి. ఈ క్రమంలోనే ప్రభాస్‌ కల్కి మూవీలో నటించేందుకు ఒప్పుకోలేదని టాక్‌. అయితే, ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఇది వైరల్‌ అవుతున్నది.

Latest News