Site icon vidhaatha

Prabhas|మ‌రో సినిమాని మొద‌లు పెట్టిన ప్ర‌భాస్.. ఈ కొత్త హీరోయిన్ ఎవ‌ర‌బ్బా..!

Prabhas| యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ జోరుకి బ్రేకులు లేవు. బాహుబ‌లి సినిమా త‌ర్వాత రాధే శ్యామ్, సాహో, ఆదిపురుష్ చిత్రాలు చేసిన ప్ర‌భాస్‌కి ఇవి దారుణ‌మైన నిరాశని క‌లిగించాయి. ఆ త‌ర్వాత స‌లార్, క‌ల్కి చిత్రాల‌తో మంచి హిట్స్ అందుకున్నాడు ప్ర‌భాస్. ఇక అదే ఊపులో కొత్త సినిమా మొద‌లు పెట్టాడు.ప్రస్తుతం రాజాసాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్న ప్ర‌భాస్ రానున్న రోజుల‌లో హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కొద్ది సేప‌టి క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

ప్రభాస్ – హను రాఘవపూడి సినిమాలో క‌థానాయిక‌గా ఇమాన్ ఇస్మాయిల్ అనే అమ్మాయిని ఎంపిక చేశారు. ప్ర‌భాస్ ప‌క్క‌న ఛాన్స్ ద‌క్కించుకున్న ఈ అమ్మ‌డి గురించి ఇప్పుడు అంద‌రు ఆరాలు తీయ‌డం మొద‌లు పెట్టారు. ఇమాన్ చిన్నప్పట్నుంచి డ్యాన్సర్. ఓ పక్క డ్యాన్స్ నేర్చుకుంటూనే మరోపక్క చదువు పూర్తిచేసింది. ఆల్రెడీ ఇమాన్ సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో తన డ్యాన్స్ వీడియోలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోగా, ఆమెకి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్‌చ‌ల్ చేశాయి. అయితే హిందీతో పాటు, తెలుగు, తమిళ పాటలకూ ఆమె వేసే స్టెప్‌లు ఎంతగానో అలరిస్తాయి. అలాంటి ఇమాన్వీ ఇప్పుడు ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ సరసన జోడీగా నటించే అవకాశం దక్కడంతో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఇమాన్వీ పేరు ట్రెండ్‌ అవుతోంది.

ప్ర‌భాస్- హ‌ను మూవీ పీరియాడికల్‌ కథ కావడంతో మొదటఏదైనా పాత్ర కోసం తీసుకున్నారేమో అంద‌రు భావించారు. కానీ, ప్రభాస్‌కు జోడీగా అని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో ఈ భామ హాట్ టాపిక్‌ అయింది. ఇమాన్ ఇస్మాయిల్ 1995 అక్టోబర్ 20న దిల్లీలో పుట్టింది. చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే ఈమెకు ఎంతో ఇష్టం. అందుకే ఒక పక్క డ్యాన్స్ నేర్చుకుంటూనే మరో పక్క ఎంబీఏ పూర్తి చేసింది. సోషల్ మీడియాలో ఆమె చేసే రీల్స్‌కు యువతలో మంచి క్రేజ్‌ఉంది. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రాను సుమారు 7లక్షల మంది ఫాలో అవుతున్నారు. ప్రభాస్‌తో ఛాన్స్‌ దక్కించుకోవడంతో మిలియన్‌ ఫాలోవర్స్‌ ఇక లాంఛనమే అంటున్నారు

Exit mobile version