Site icon vidhaatha

RRR లో ప్రభాస్,రానా

విధాత:జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రౌద్రం..రణం..రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌) చిత్రం కోసం ఓ ప్రమోషనల్‌ సాంగ్‌ చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాట కోసం దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలతో సెట్‌ వేశారట. ఈ పాటలో ప్రభాస్, రానా, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ కనిపిస్తారనే టాక్‌ వినిపిస్తోంది. ఆగస్ట్‌ 1న స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ పాటను విడుదల చేయాలనుకుంటున్నారని టాక్‌.

ఇదిలావుంటే ప్రభాస్‌ ఇటలీ వెళ్లొచ్చాడు. ఎందుకు? హాలిడే ట్రిప్పా? ‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌ కోసమా? ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో జరుగుతున్న చర్చల్లో ఇదో హాట్‌ టాపిక్‌. కొన్ని రోజులుగా ఇటలీలో ఉన్న ప్రభాస్‌ ఇండియా చేరుకున్నారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఆయన బయటకు వస్తున్నప్పుడు కొన్ని కెమెరాలు క్లిక్‌మన్నాయి. ఇక ప్రభాస్‌ ఇటలీ ఎందుకు వెళ్లారనే విషయాన్ని పక్కనపెడితే, ఈ 23 నుంచి ‘రాధేశ్యామ్‌’తో బిజీ అవుతారని తెలిసింది. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌. ఈ సినిమా ఫైనల్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ ఈ నెల 23న హైదరాబాద్‌లో ఆరంభమై, ఆగస్టు 5 వరకు జరుగుతుందని తెలిసింది.

Exit mobile version