Prabhudeva-Nyan| లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళ, మలయాళ భాషలలో నటించిన నయనతార తన నటనతో అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది.చంద్రముఖి, గజినీ చిత్రాల సక్సెస్ తో నయనతార స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగింది. లక్ష్మి, యోగి, దుబాయ్ శ్రీను, అదుర్స్ వంటి హిట్ చిత్రాలతో తెలుగులో కూడా పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామ వ్యక్తిగత జీవితంలో మాత్రం అన్నీ వివాదాలే. ముఖ్యంగా రెండు పర్యాయాలు ఆమె ప్రేమలో విఫలం చెందింది. కెరీర్ ప్రారంభంలోనే నయనతార శింబుతో డేటింగ్ చేసింది. వీరిద్దరి ప్రైవేట్ ఫోటోలు సైతం బయటకు వచ్చాయి. అప్పట్లో శింబు, నయనతారల ఎఫైర్ కథనాలు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి.
ఇక శింబుతో రిలేషన్‌షిప్‌పై నయనతార స్పందించింది లేదు. అయితే శింబుతో ప్రేమాయణం తర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపింది నయన్. ప్రభుదేవా తన ప్రేమలో భాగంగా నయనతార కోసం తన భార్య రమలతకు విడాకులు ఇచ్చేశాడు. అప్పట్లో ఈ మ్యాటర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రభుదేవా, నయనతార మూడు ముళ్ళ బంధంతో ఒకటి అవుతారని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ప్రభుదేవా, నయనతార బ్రేకప్ చెప్పుకున్నారు. పెళ్లి వరకు వెళ్లిన ఈ జంట ఎందుకు విడిపోయారు అనే ప్రశ్నకు కొన్ని కారణాలు ప్రధానంగా వినిపించాయి. అయితే తాజాగా వీరి బ్రేకప్‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..
నయనతారకు ప్రభుదేవా చాలా కండిషన్లు పెట్టేవారని కోలీవుడ్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. క్రిస్టియన్‌గా ఉన్న నయనతారను ప్రభుదేవా తన మతంలోకి మారాలని చెప్పారట. అందుకు నయనతార అంగీకరించారట. అలాగే పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని.. హౌస్ వైఫ్ గా మారిపోవాలని ప్రభుదేవా కండీషన్ పెట్టాడంతో నయనతార మాత్రం ససేమీరా ఒప్పుకోలేదు. మ్యారేజ్ తర్వాత కూడా యాక్టింగ్ కొనసాగిస్తానని.. కావాలంటే గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటానని నచ్చజెప్పే ప్రయత్నం చేసిందట. తన మొదటి భార్య పిల్లలు కూడా మనతోనే ఉంటారని ప్రభుదేవా చెప్పడం వీరి విడిపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పెళ్లికి ముందే ప్రభుదేవా ఇలా ప్రవర్తించడంతో, పెళ్లి తర్వాత ఎలా ఉంటారో అనే భయంతో అతనికి బ్రేకప్ చెప్పేసిందట. ఇక నయనతార కొద్ది సంవత్సరాల క్రితం విఘ్నేష్ శివన్‌ని పెళ్లి
చేసుకొని ఇద్దరు పిల్లలకి జన్మినిచ్చిన విషయం తెలిసిందే