Site icon vidhaatha

Kurchi Madathapetti Song|కుర్చీ మ‌డ‌త పెట్టి సాంగ్ విని క‌డుపులో బేబి తంతున్నాడు.. ప్ర‌గ్నెంట్ ఉమెన్ కామెంట్ వైరల్

Kurchi Madathapetti Song| సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం గుంటూరు కారం. ఈ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గర అంచ‌నాల‌ని అంత‌గా అందుకోలేక‌పోయింది. అయితే మూవీలోని ‘కుర్చీ మడత పెట్టి’ పాట మాత్రం రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ పాట‌కి విదేశీయులు కూడా ప‌ర‌వ‌శించిపోతున్నారు. థమన్ ఇచ్చిన నాటు మాస్ బీట్‍కు మహేశ్ బాబు, శ్రీలీల డ్యాన్స్ తోడు కావ‌డంతో ఈ సాంగ్‌కి యూట్యూబ్‌లో అశేష ఆద‌ర‌ణ పెరుగుతూ పోతుంది. సినిమా రిలీజ్ కి ముందే ఈ పాట సోషల్ మీడియాలో ఓ ఊపు ఊప‌గా, రిలీజ్ అయ్యాక థియేట‌ర్స్‌లో హంగామా సృష్టించింది. ఇంటర్నేషనల్ స్టేజీలపై కూడా ఈ పాట వినిపిస్తుండ‌డం విశేషం.

కుర్చీ మ‌డ‌త పెట్టి సాంగ్ ఇటీవ‌ల యూట్యూబ్‍లో 200 మిలియన్ (20 కోట్ల) వ్యూస్ మార్క్ దాటేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్‍లో కుర్చీ మడతపెట్టి ఫుల్ వీడియో సాంగ్ అప్‍లోడ్ చేయగా.. సునాయాసంగా 200 మిలియన్ వ్యూస్‍ను క్రాస్ చేసి దూసుకుపోతుంది. అప్‍లోడ్ అయి 80 రోజులు ముగియకుండానే ఈ ఘనత సాధించ‌డం విశేషం. అయితే ఈ సాంగ్‌పై ఓ ప్రగ్నెంట్ వుమెన్ పెట్టిన కామెంట్ బాగా వైరల్ అవుతుంది. అన్విత జోబి అనే అకౌంట్ నుంచి కుర్చీ మడతపెట్టి వీడియో సాంగ్ కింద కామెంట్స్ లో.. నేను ఇప్పుడు ఆరు నెలల ప్రగ్నెంట్, ఈ పాట ప్లే అయిన ప్రతి సారి కడుపులో బిడ్డ నా పొట్టని తంతున్నాడు అంటూ కామెంట్ చేసింది.

సోషల్‌ మీడియాలో ఆ గర్భిణి పెట్టిన పోస్ట్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.. మహేష్ బాబు అభిమానులతో పాటు నెటిజన్స్‌ కూడా ప్రస్తుతం ఈ కామెంట్‌ కు తెగ రియాక్ట్‌ అవుతున్నారు. ఆమెది ఎక్కడ అనే విషయాలను కొందరు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటే మరి కొందరు ఆమె చెప్పింది నిజ‌మేనా అని తెలుసుకోవాల‌ని చూస్తున్నారు. అయితే పెద్దయ్యాక ఆ బేబీ డాన్సర్ అవుతాడేమో, థమన్ కడుపులో పిల్లల్ని కూడా తన మ్యూజిక్ తో ఊపు తెప్పిస్తున్నాడుగా ఇలా ప‌లు ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సాంగ్ ఇండియాతో పాటు ఇతర దేశాల్లోనూ మంచి క్రేజ్ ద‌క్కించుకుంది. అమెరికాలోని ఓ బాస్కెట్ బాల్ ఈవెంట్‍లోనూ ఈ పాటకు డ్యాన్స్ చేయ‌గా, ఆ వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేసింది.

Exit mobile version