Site icon vidhaatha

Puri jagannath| త‌న భార్య గురించి ఆ విష‌యం తెలిసి షాక్.. లావ‌ణ్య‌ని వ‌దిలేద్దామ‌ని అనుకున్న పూరీ జ‌గ‌న్నాథ్‌

Puri jagannath| టాలెంటెడ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. క్లాస్ హీరోల‌ని కూడా మాస్‌గా చూపించి మంచి హిట్స్ అందించాడు. చివ‌రిగా లైగ‌ర్‌తో దెబ్బ తిన్న పూరీ జ‌గ‌న్నాథ్ ఇప్పుడు రామ్‌తో డ‌బుల్ ఇస్మార్ట్ చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ మంచి హిట్ కొడుతుంద‌ని అంద‌రు ఆశిస్తున్నారు. అయితే ఈ క్ర‌మంలో పూరీ జ‌గ‌న్నాథ్‌కి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైర‌ల్ అవుతుంది.సరదాగా షూటింగ్ చూడటానికి వచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్ళాడాడు పూరి. ఆయ‌న ప్రేమ‌, పెళ్లి సినిమాల‌లో మాదిరిగానే జ‌రిగింది. తాను ప్రేమించిన అమ్మాయిని బయటకు తీసుకెళ్లడానికి కూడా పూరీ ద‌గ్గ‌ర డ‌బ్బులు ఉండేవి కావ‌ట‌. దాంతో అప్పు చేసి తీసుకెళ్ళే వాడ‌ట‌. ఇలానే ఓ సారి ఓ కాస్ట్లీ రెస్టారెంట్ కు  తీసుకెళ్ళింది. అయితే జేబులో డబ్బలు సరిపోతాయా లేదా అని భయపడ్డాను.

అయితే అప్పుడు తాను ఒక ఫుల్ తందూరి కోడి ఆర్డర్ ఇచ్చింది. నాకేమో డబ్బులు సరిపోతాయా లేదా అని టెన్షన్ తో తింటున్నట్టు నటించాను.. కాని తానుమాత్రం అలా పుల్ కోడి మొత్తం తినేసింది. అయితే ఆ స‌మ‌యంలో ఒక నిర్ణ‌యానికి వ‌చ్చాను. ఇలా రెస్టారెంట్లకుతిరిగి టెన్షన్ భరించలేను కాని పెళ్ళి చేసుకునే ఉద్దేశం ఉంటే.. డైరెక్ట్ గా అప్పుడే కలుద్దాం.. బయట తిరగడం ఇక బంద్ చేద్దాం అని ఆమెకి చెప్పాను అని పూరీ పేర్కొన్నారు. అయితే ఆమె అలా ఒక కోడిని తినేసే సరికి నా భవిష్య‌త్‌పై భ‌యం వేసింది. డైరెక్టర్ గా నాకు లైఫ్ రావాలి లేక‌పోతే చాలా క‌ష్టం అనుకున్నా. అయితే త‌న‌ని వ‌దిలేయాలని కూడా ఓ ద‌శ‌లో అనుకున్నాను. అయితే ఆ త‌ర్వాత తానెప్పుడు హెవీగా తిన‌డం తాను చూడ‌లేద‌ని పేర్కొన్నారు.

ఇక పెద్ద‌ల‌ని ఒప్పించి పెళ్లి చేసుకున్న వారు వారికి చెప్ప‌కుండా వివాహం చేసుకున్నార‌ట‌. పెద్దలు పెళ్ళి చేస్తే చాలా ఖర్చు అవుతుంది. అందుకే వారి చేత ఖర్చు పెట్టించడం ఎందుకు అని వారే చేసుకున్నార‌ట‌. ఇక పూరీ పెళ్లి అయిన స‌మ‌యంలో కృష్ణ‌వంశీ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా ప‌ని చేస్తున్నార‌ట‌. ఆ స‌మ‌యంలో షూటింగ్ సెట్‌లో త‌న పెళ్లి జ‌రిగింద‌ని పూరీ చెప్పుకొచ్చాడు.అప్పుడు తాళబొట్టు ఒకరు, కూల్ డ్రింక్స్ మరొకరు, పెళ్ళి బట్టలు ఇంకొకరు.. ఇలా అందరూ తలా ఒక ఐటం తీసుకు వచ్చి.. సెట్ లోనే తమ పెళ్లి చేశారంటూ పూరీ జ‌గ‌న్నాథ్ త‌న ప్రేమ‌, పెళ్లికి సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేశారు.

Exit mobile version