Allu Arjun | టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మరికొన్ని సినిమాలపై చాలానే చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి పుష్ప-2 తర్వాత త్రివిక్రంతో సినిమాను అనౌన్స్ చేసిన బన్నీ.. తాజాగా సినిమా చేయాలనుకోవడం సమాచారం. సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసేందుకు కొంత టైమ్ కావాలని చెప్పాడని టాక్. ఇటీవల కోలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ కాంబోలో మూవీ రాబోతుందని తెగ ప్రచారం జరిగింది. కానీ, రెమ్యునరేషన్ కారణంగా క్యాన్సిల్ అయినట్లు టాక్. ఇక అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు తమిళ దర్శకుడు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఓ కథను డైరెక్టర్ నెల్సల్ దిలీప్ కుమార్ సిద్ధం చేసినట్లు సమాచారం. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘జైలర్’ సినిమా చేసిన దిలీప్ కుమార్.. అల్లు అర్జున్ కోసం ఓ క్రేజీ స్టోరీనే రాశాడని.. బన్నీని కలిసి కథ వినిపించినట్లు తెలుస్తున్నది.
అల్లు అర్జున్ దాదాపు నెల్సన్ చెప్పిన కథకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రజనీ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ‘జైలర్’ మూవీకి మళ్లీ సీక్వెల్‌గా ‘జైలర్-2’ని తీసుకురావాలని ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు. అప్పటిలోగా అర్జున్ మూవీని కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడు. అల్లు అర్జున్, నెల్సన్ కాంబోలో సినిమా వస్తే.. అది వేరే లెవల్‌లో ఉండబోతుందడనంలో సందేహం లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 తర్వాత కొంత విశ్రాంతి తీసుకోవాలని చూస్తున్నాడు. పుష్ప-2 తర్వాత.. పుష్ప-3 కూడా ఉండబోతుందని టాక్. ఆ సినిమాకు చాలా టైం తీసుకోవాలని అల్లు అర్జున్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈలోగా నెల్సన్ దర్శకత్వంలో సినిమాను చేస్తాడా? లేదా? తెలియాల్సి ఉంది. పుష్ప-2 తర్వాత సినిమా చేసేందుకు సరైన డైరెక్టర్ కోసం అల్లు అర్జున్ వెతుకుతున్నాడని.. ఎవరూ దొరకడం లేదని టాక్. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషనల్‌లో వస్తున్న పుష్ప-2 వాస్తవానికి ఆగస్టులో రిలీజ్ చేయాలని భావించినా.. డిసెంబర్‌కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.