Site icon vidhaatha

Raj Tarun| రాజ్ త‌రుణ్‌కి ప‌దేళ్ల జైలు శిక్ష ప‌డ‌నుందా..మాల్విపై కూడా కేసు న‌మోదు..!

Raj Tarun| లావణ్య-రాజ్ తరుణ్ వివాదం ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రాజ్ త‌రుణ్‌ని వ‌దిలేది లేదని, న‌న్ను బ్యాడ్‌గా చిత్రీక‌రించిన వారిని క‌ట‌క‌ట‌ల్లోకి నెట్టే వ‌ర‌కు ఎంత‌వ‌ర‌కైన వెళ‌తాన‌ని లావణ్య అంటుంది. రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పొందుప‌ర‌చ‌డంతో తాజాగా రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాలపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో ఏ1గా రాజ్ తరుణ్, ఏ2గా మాల్వీ, ఏ3గా మాల్వీ సోదరుడు మయాంక్ మల్హోత్రాలను చేర్చారు. ఐపీసీ సెక్షన్లు 420, 493, 506 కింద కేసు నమోదు చేసినట్టు నార్సింగి పోలీసులు తెలిపారు.

సెక్షన్‌ 493 నమోదుతో రాజ్‌తరుణ్‌ చిక్కుల్లో పడ్డాడు. అది నాన్‌బెయిలబుల్‌ సెక్షన్‌ కావడంతో అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంది. మోసపూరిత పెళ్లి కింద పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసులు చెబుతున్నారు. ఇక రాజ్ తరుణ్ తో తనకు 2008లో పరిచయం ఏర్పడిందని లావ‌ణ్య అంటుంది. 2014లో తాము పెళ్లి చేసుకున్నామని… ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమ కుటుంబం రూ. 70 లక్షల వరకు ఆయనకు సాయం చేశాన‌ని చెప్పుకొచ్చింది .ఇక 2016లో తాను గర్భం దాల్చానని… రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని కూడా పేర్కొంది.

అయితే త‌న‌ని రాజ్ తరుణ్, మాల్వీ డ్రగ్స్ కేసులో ఇరికించిన‌ట్టు లావ‌ణ్య చెబుతుంది. తప్పుడు ఆరోపణలతో తనను రిమాండ్ చేశారని… తాను 45 రోజుల పాటు జైల్లో ఉన్నట్టు లావ‌ణ్య పేర్కొంది అయితే జైలు నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాకు ప్ర‌శ్నిస్తే.. చంపేస్తామంటూ రాజ్ తరుణ్, మాల్వీ, మయాంక్ బెదిరించారని ఆమె వెల్ల‌డించింది. ఇక మాల్వి మ‌ల్హోత్రాపై పెట్టిన కేసు గురించి స్పందిస్తూ.. మాల్వి మల్హోత్రా బ్రదర్ కి నేను పంపిన సందేశాలు, చేసిన ఫోన్ కాల్స్ కి సంబంధించిన కేసు అదని అన్నారు.ఇక డ్ర‌గ్స్ కేసులో సాయి A 9 కాగా, నేను A 11. ఇద్దరం కలిసి కేసును ఎదుర్కొందాము. కలిసి పోరాడదామని అనుకున్నాము. అంతే త‌ప్ప మా ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి రిలేష‌న్ లేదంటూ కూడా లావ‌ణ్య పేర్కొంది.

Exit mobile version