Site icon vidhaatha

Raj Tarun| నీ కాళ్లు ప‌ట్టుకుంటా.. రాజ్ త‌రుణ్‌ని వ‌దిలేయ్.. ఆడియో కాల్ రికార్డ్ వైర‌ల్

Raj Tarun| ఇటీవ‌ల సరైన స‌క్సెస్‌లు లేక దిగాలుగా ఉన్న రాజ్ త‌రుణ్ తాజాగా లైంగిక వేధింపుల విష‌యంతో వార్త‌ల‌లోకి ఎక్కాడు.హీరో రాజ్ తరుణ్ తో తాను రిలేష‌న్ షిప్‌లో ఉన్నాన‌ని, మేము గుడిలో కూడా పెళ్లి చేసుకున్నామ‌ని, అయితే ఓ హీరోయిన్‌తో ఎఫైర్ వ‌ల‌న నన్ను మోసం చేసి రాజ్ త‌రుణ్ వెళ్లిపోయాడంటూ లావ‌ణ్య అనే యువ‌తి పోలీస్ స్టేష‌న్ మెట్లెక్కింది.రాజ్ తరుణ్ నా ప్రపంచం, నాకు అత‌ను కావాలి. ద‌య చేసి నాకు న్యాయం చేయాలంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో లావ‌ణ్య రాత‌పూర్వ‌కంగా కంప్లైంట్ ఇచ్చింది. గ‌తంలో త‌న‌ని డ్ర‌గ్స్ కేసులో ఇరికించార‌ని కూడా అందులో రాసింది. అయితే లావ‌ణ్య ఆరోప‌ణ‌లు చేసిన కొద్ది నిమిషాల‌లోనే రాజ్ త‌రుణ్ మీడియా ముందుకు వ‌చ్చారు.

లావ‌ణ్య‌తో తాను రిలేషన్ లో ఉన్నమాట వాస్తమే అని చెప్పుకొచ్చాడు. అయితే త‌మ మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు. గుడిలో పెళ్లి చేసుకున్నాను అనేది కూడా పచ్చి అబద్దం. ఆ అమ్మాయి డ్ర‌గ్స్‌కి అల‌వాటు ప‌డింది. మరో అబ్బాయితో నా ఇంట్లోనే కలిసి ఉంటుంది. అతనితో పెళ్లి విషయంలో గొడవ జరిగితే లావణ్య పోలీస్ కేసు పెట్టింది. గతంలో లావణ్య మంచి అమ్మాయి. నాకు ఎంతో సాయం చేసింది. ఆ కృత‌జ్ఞ‌త‌తోనే నేను భ‌రించాను. కాని ఆమెకి చెత్త ఫ్రెండ్స్ పరిచ‌యం కావ‌డం, న‌న్ను టార్చ‌ర్ పెట్ట‌డం వ‌ల‌న వ‌దిలేసాను. ఇండస్ట్రీలో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను… ఆమె ప్రతి విషయానికి న‌న్ను బెదిరించేది. అందుకే లావణ్య నుంచి దూరంగా ఉంటున్నానని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు.

అయితే లావ‌ణ్య ఓ ఆడియా కాల్ రికార్డ్ మీడియాకి లీక్ చేయ‌డంతో అంద‌రు అవాక్క‌య్యారు. అందులో హీరోయిన్ మాల్వి మల్హోత్రా-లావణ్య మధ్య ఫోన్లో వాగ్వాదం చోటు చేసుకుండ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. రాజ్ త‌రుణ్ నువ్వు చెప్పిన‌ట్టు వింటున్నాడు. అత‌నిని ద‌యచేసి వ‌దిలేయ్. నీ కాళ్లు ప‌ట్టుకుంటాను. నీలాంటి వాళ్లు కెరీర్‌లో అస్స‌లు ఎద‌గ‌లేరు అంటూ మాల్వి మల్హోత్రాతో లావణ్య వాదనకు దిగింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇక మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ తిరగబడరసామీ మూవీలో క‌థానాయిక కాగా, వీరిద్ద‌రి మ‌ధ్య కొన్నాళ్ల నుండి ఎఫైర్ న‌డుస్తుంద‌ని ఆరోపించింది లావ‌ణ్య‌. మ‌రి ప్రేమ క‌థా చిత్ర‌మ్‌కి ఎలా పులిస్టాప్ ప‌డుతుందో చూడాలి.

Exit mobile version