Raj Tharun| టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఇటీవలి కాలంలో పెద్దగా సక్సెస్‌లు అందుకుంది లేదు. తిరగబడరా సామి అనే చిత్రంతో త్వరలో ప్రేక్షకులని పలకరించనున్నాడు. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్‌పై రాజ్ తరుణ్ ఫోకస్ పెడుతున్న సమయంలో రాజ్ తరుణ్ గురించి మాజీ ప్రేయసి లావణ్య మీడియా ముందుకు వచ్చి సంచలన కామెంట్స్ చేసింది. 11 ఏళ్ళ నుంచి తాను, రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నామని.. శారీరక సంబంధం కూడా పెట్టుకున్నామని , కాని ఇప్పుడు నన్ను వదిలేసి మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో ఎఫైర్ సాగిస్తున్నాడని ఆమె చెప్పుకొచ్చింది. మాల్వి మల్హోత్రా వల్ల రాజ్ తరుణ్ నాకు దక్డనే నమ్మకం పోయినట్టు చెప్పుకొచ్చింది.
ఇక రాజ్ తరుణ్ , లావణ్యల వివాదం నడుస్తున్న సమయంలో ఈ కుర్ర హీరో పెట్టుకున్న ఎఫైర్స్ లిస్ట్ ఒకటి బయటకు వచ్చింది. అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే, రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే అనే చిత్రంలో నటించగా ఆ సమయంలో షాలిని పాండేతో ఎఫైర్ పెట్టుకున్నట్టు లావణ్య చెప్పుకొచ్చింది.ఇక రాజ్ తరుణ్ ప్రియురాళ్ల లిస్ట్ లో బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీ కూడా ఉందట. చెన్నైకి ఓ కోర్సు నేర్చుకోవడం కోసం వెళ్ళినప్పుడు.. రాజ్ తరుణ్ అరియనాతో రిలేషన్ పెట్టుకున్నాడని లావణ్య పేర్కొంది. అయితే అప్పుడు రాజా రవీంద్ర నాకు ఫోన్ చేసి రాజ్ తరుణ్ మనకి దక్కడు అని చెబితే వెంటనే నేను చెన్నై నుంచి వచ్చేశాను అని లావణ్య పేర్కొంది.
లవర్ సినిమా టైంలో రిద్ది కుమార్ తో కూడా రాజ్ తరుణ్ ప్రేమాయణం సాగించాడు . దాదాపు ఆరు నెలలు వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు. నేను ఫోన్ చేసి ఆ అమ్మాయికి చెప్పాను. అప్పుడు ఆమె రాజ్ ని వదిలేసింది అని పేర్కొంది. హీరోయిన్ల కోసం రాజ్ తరుణ్ రోజుకి 70వేల వరకు ఖర్చు చేస్తాడు. 11 ఏళ్లుగా నేను అతడితో రిలేషన్ లో ఉన్నా కూడా ఇల్లు గడవడానికి కూడా డబ్బులు ఇవ్వలేదు. రాజ్ తరుణ్‌కి చెందిన 15 కుక్కలు తన వద్దే ఉండగా, వాటి ఆలనాపాలనా చూసేందుకు కూడా డబ్బు ఇచ్చేవాడు కాదు. రాజ్ తరుణ్ ఎవరితో ఎన్ని ఎఫైర్లు పెట్టుకున్నా తనకి ప్రాబ్లెమ్ లేదని , అతడు నాకు దక్కితే చాలని అంటుంది లావణ్య