Site icon vidhaatha

Rajinikanth| అంబాని పెళ్లిలో ర‌జ‌నీకాంత్ అదిరిపోయే స్టెప్పులు.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

Rajinikanth| రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యాధినేత, భారతీయ సంపన్నుడు ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహ వేడుక క‌నుల పండుగ‌గా జ‌రిగింది.ముంబయిలోని జియో కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ వివాహ సంబరాల్లో అమెరికా ప్రభుత్వ మాజీ పెద్దలు, సినీ తారలు, క్రీడాకారులు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని సంద‌డి చేశారు.స్టార్ నటీనటులంతా కూడా ఆ వేడుక‌లో డ్యాన్సులు చేస్తూ ఫోటోలు దిగుతూ అభిమానులని, నెటిజన్లని ఆశ్చర్యపరిచారు. అయితే సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉత్సాహంగా డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు.

పెళ్లికొడుకు అనంత్ అంబానీ తో కలిసి రజనీకాంత్ అదిరిపోయేలా స్టెప్పులు వేశారు. ఆ వ‌య‌స్సులో కూడా అంత ఉత్సాహంగా ర‌జ‌నీకాంత్ స్టెప్పులు వేస్తుండ‌డం చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారు. మ‌రోవైపు బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూడా రజనీతో కాలు కదిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు రజినీకాంత్ తన భార్య లత, కూతురు ఐశ్వర్య, మనవడితో కలిసి వెళ్లారు. ఇక అక్క‌డ అందరూ డ్యాన్స్ చేస్తుంటే రజినీకాంత్ కూడా అనంత్ అంబానీ, అనిల్ కపూర్, రణవీర్ సింగ్‌తో పాటు కాలు క‌దిపి అందరిని ఉత్సాహ‌ప‌రిచారు. సినిమాల‌లో కూడా చిన్న చిన్న స్టెప్పుల‌తో ర‌జ‌నీకాంత్ ఆక‌ట్టుకుంటారు. ఇక ఇప్పుడు పెళ్లిలో ర‌జ‌నీకాంత్ వేసిన స్టెప్పులు అంద‌రిని అల‌రిస్తున్నాయి.

ఇక అట్ట‌హాసంగా జ‌రిగిన అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పరిణయ మహోత్సవ వేడుక‌కి ప్రొఫెషనల్ రెజ్లర్ జాన్ సీనా, నిక్ జొనాస్-ప్రియాంక చోప్రా, షారుఖ్ ఖాన్, గౌరి ఖాన్, సల్మాన్ ఖాన్, ఆయన సోదరి అర్పిత్ ఖాన్, విక్టరీ వెంకటేశ్, మహేశ్ బాబు, నమ్రత, సితార, క్రికెటర్ హార్దిక్ పాండ్యా, నిధి అగర్వాల్, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్, వికీ కౌశల్, ధోనీ, సాక్షి, జివా, జాకీ ష్రాఫ్, కేఎల్ రాహుల్, అతియా శెట్టి, సునీల్ శెట్టి, అహాన్ శెట్టి తదితరులు హాజరై తెగ సంద‌డి చేశారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీల పిక్స్ తెగ సంద‌డి చేస్తున్నాయి.

Exit mobile version