Rajinikanth| శ్రీదేవిని పీక‌ల్లోతు ప్రేమించిన ర‌జ‌నీకాంత్ ఆమె ఇంటికి వెళ్లి ప్రపోజ్ చేయ‌బోయాడా..!

Rajinikanth| అతిలోక సుందరి శ్రీదేవి అందానికి మంత్ర ముగ్ధులు కాని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదేమో. ఆమె అందాన్ని చూసి ప్ర‌తి ఒక్కరు ప‌ర‌వ‌శించిపోతుంటారు. శ్రీదేవి అందాల‌ని సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఎంత గొప్ప‌గా వ‌ర్ణిస్తుంటారో మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కూడా శ్రీదేవి ప్రేమ‌లో ప‌డ్డాడ‌ట.ఆమెకి ప్ర‌పోజ్ చేసేందుకు ఇంటికి కూడా వెళ్లాడ‌ట. ఇప్పుడు ఈ విష‌యం నెట్టింట తెగ హల్‌చ‌

  • Publish Date - June 9, 2024 / 06:37 PM IST

Rajinikanth| అతిలోక సుందరి శ్రీదేవి అందానికి మంత్ర ముగ్ధులు కాని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదేమో. ఆమె అందాన్ని చూసి ప్ర‌తి ఒక్కరు ప‌ర‌వ‌శించిపోతుంటారు. శ్రీదేవి అందాల‌ని సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఎంత గొప్ప‌గా వ‌ర్ణిస్తుంటారో మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కూడా శ్రీదేవి ప్రేమ‌లో ప‌డ్డాడ‌ట.ఆమెకి ప్ర‌పోజ్ చేసేందుకు ఇంటికి కూడా వెళ్లాడ‌ట. ఇప్పుడు ఈ విష‌యం నెట్టింట తెగ హల్‌చ‌ల్ చేస్తుంది. వివ‌రాల‌లోకి వెళితే ర‌జ‌నీకాంత్ త‌న కెరీర్‌లో చాలా మంది హీరోయిన్స్‌తో క‌లిసి ప‌ని చేశారు. ఇక శ్రీదేవితో క‌లిసి 19 సినిమాలు చేశారు. తెలుగు, త‌మిళం , క‌న్నడ‌, హిందీ భాష‌ల‌లో వారిద్ద‌రు క‌లిసి ప‌ని చేయ‌గా, వారి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉండేది.

ర‌జ‌నీకాంత్, శ్రీదేవి క‌లిసి చాలా సినిమాలు చేయ‌డంతో వారి మ‌ధ్య మంచి స్నేహం ఉండేది. ఆ క్ర‌మంలో శ్రీదేవికి తెలియ‌కుండా ఆమెపై విప‌రీత‌మైన ప్రేమ‌ని పెంచుకున్నార‌ట ర‌జ‌నీకాంత్. శ్రీదేవి ప్రేమించడంతో పాటు.. పెళ్ళాడాలని కూడా ఆయన భావించార‌ట. ఈ విషయాన్ని శ్రీదేవి తల్లితో కూడా రజనీ చెప్ప‌గా, ఆమె కాస్త ఆలోచించింది. అందుకు కార‌ణం శ్రీదేవి క‌న్నా ర‌జ‌నీకాంత్ 13 ఏళ్లు పెద్ద‌. అయితే ర‌జ‌నీకాంత్ ఎప్పుడు కూడా శ్రీదేవికి ర‌క్ష‌ణ‌గా ఉండేవాడు. ఆమె ఇంటికి వెళ్లి శ్రీదేవికి ప్ర‌పోజ్ చేయాల‌ని అనుకున్నాడ‌ట‌.

శ్రీదేవి గృహప్రవేశ వేడుకకు బాల‌చంద‌ర్‌తో క‌లిసి వెళ్లాడు ర‌జ‌నీకాంత్ అయితే వారి ఇంటికి చేరుకోగానే కరెంటు పోయింది. ఇల్లంతా చీకటిగా ఉండ‌డంతో దీన్ని చెడ్డ శకునంగా తీసుకున్న రజనీకాంత్ తన పెళ్లి గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా నిరాశతో వెనుదిరిగారు అని బాల‌చంద‌ర్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. తమ ప్రేమ‌కు అప‌శ‌కునం వ‌చ్చిన కార‌ణంగా త‌న ప్రేమ గురించి ర‌జ‌నీకాంత్ ఆమెతో ఎప్పుడు చెప్ప‌లేద‌ట‌. కాక‌పోతే ఆమెతో గొప్ప స్నేహాన్ని మాత్రం పంచుకున్నారు. ర‌జ‌నీకాంత్ కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడు ఆయ‌న ఫోన్ నెంబ‌ర్ కేవ‌లం కె. బాలచందర్, కమల్ హాసన్, శ్రీదేవి వంటి కొందరి ద‌గ్గ‌ర మాత్ర‌మే ఉండేద‌ట‌. ఓ సారి ర‌జ‌నీకాంత్ అస్వ‌స్థ‌త‌కి గురైన‌ప్పుడు శ్రీదేవి ఆయ‌న కోసం ఉప‌వాస దీక్ష కూడా చేసింద‌ట‌. ఇక శ్రీదేవి మ‌ర‌ణించిన రోజు ర‌జ‌నీకాంత్ మ్యారేజ్ డే కాగా, ఆ రోజు యానివ‌ర్స‌రీ వేడుక‌ని జ‌రుపుకోలేదు ర‌జ‌నీకాంత్

Latest News