Rakul Preet Singh | టాలీవుడ్ (Tollywood) బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) గాయపడింది. వర్కవు చేస్తున్న సమయంలో తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. జిమ్‌లో వర్కవుట్ (Gym Workout) చేస్తున్న సమయంలో 80 కిలోల బరువును ఎత్తడంతో వీపు భాగంలో గాయలయ్యాయని తెలుస్తున్నది. దాంతో ఆమె వైద్యులను సంప్రదించగా.. వారం రోజుల పాటు బెడ్‌రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆరోగ్యం మెరుగ్గా ఉందని సమాచారం. రకుల్ ఈ నెల 5న గాయాలకు గురైందని టాక్. బరువును ఎత్తే సమయంలో బెల్ట్‌ని ధరించకపోవడంతోనే వెన్నునొప్పి బారినపడ్డట్లు సమాచారం. దాన్ని నుంచి బయటపడేందుకు బెడ్‌రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారని.. ఆ తర్వాత ప్రస్తుతం మూవీ షూటింగ్‌కు హాజరవుతున్నది. షూటింగ్ సమయంలో నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం రకుల్ దేదే ప్యార్ దే- మూవీలో నటిస్తున్నది. ఇటీవల వరుసగా రెండురోజులకు రకుల్ ప్రీత్ సింగ్ షూటింగ్ హాజరైంది. వరుస షూటింగ్‌తో మళ్లీ నొప్పి తిరగబెట్టగా.. ఫిజియోని కలిసిందని సమాచారం. ఆయన పూర్తిగా బెడ్‌రెస్ట్ తీసుకోవాలని సూచించారట. ప్రస్తుతం నటి కోలుకుంటుంది. బెల్ట్ ధరించకుండా 80 కిలోల బరువును ఎత్తేందుకు ప్రయత్నించిన సమయంలో వెన్నెముకలోని ఎల్4, ఎల్5, ఎస్1 సమీపంలోని నరాలపై ఒత్తిడిపడిందని.. దాంతోనే నొప్పి వస్తున్నట్లు చెప్పినట్లు సమాచారం. 2019లో విడుదలైన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘దే దే ప్యార్ దే’ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్నది. ఈ మూవీలో అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్, టబు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా అన్షుల్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. భూషణ్ కుమార్, లవ్ రంజన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది మే ఒకటో తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్‌కు గాయం.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
