Site icon vidhaatha

Ram Charan| నాకు ఎదురొస్తావా అంటూ అనీల్ రావిపూడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్‌

Ram Charan| మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత చ‌ర‌ణ్ క్రేజ్ ఏ స్థాయికి చేరుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు శంకర్ ద‌ర్శ‌కత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ద‌సరా కానుక‌గా విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది. ఈ మూవీ త‌ర్వాత బుచ్చిబాబుతో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌బోతున్నారు.ఈ సినిమాతో రామ్ చరణ్ పేరు ఖండాంత‌రాలు దాట‌నుందని అంటున్నారు. అయితే రామ్ చ‌రణ్ సినిమాల విష‌యం ప‌క్క‌న పెడితే ఆయ‌న చాలా మృదు స్వ‌భావి. ఎవ‌రితోను వివాద‌ల జోలికి వెళ్లాడు. త‌న ప‌నేదో తాను చేసుకుంటూ ముందుకు వెళుతుంటాడు.అయితే ఓ సారి అనీల్ రావిడిపూడికి వార్నింగ్ ఇచ్చాడట చెర్రీ. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి స్వయంగా వెల్లడించాడు.

రాజ‌మౌళి త‌ర్వాత ఓట‌మి అనేది లేకుండా వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూసుకుపోతున్న ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి. ఆయ‌న తీసిన పటాస్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు , భగవంత్ కేసరి చిత్రాలు ఆయ‌న‌ని స్టార్ డైరెక్ట‌ర్‌గా మార్చాయి. ప్ర‌స్తుతం ఈ ద‌ర్శ‌కుడు వెంక‌టేష్‌తో ఓ సినిమా చేస్తున్న‌ట్టు టాక్ న‌డుస్తుంది. వారిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన ఎఫ్‌2,ఎఫ్ 3 చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడో సినిమా చేయ‌బోతున్నారు. అయితే అనీల్ రావిపూడి తాజాగా రామ్ చ‌ర‌ణ్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యం పంచుకుంటున్నారు. 2019 సంక్రాంతి బరిలో వినయ విధేయ రామ, ఎఫ్ 2, ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాలు విడుద‌ల కాగా ఆ మూడింటిలో ఎఫ్‌2 మంచి విజ‌యం సాధించింది.

‘వినయ విధేయ రామ’ సినిమా వలన రామ్ చ‌ర‌ణ్ దారుణ‌మైన ట్రోలింగ్‌కి గుర‌య్యాడు. చిత్రంలో ట్రైన్ సీన్, గద్ద సీన్ విష‌యంలో బాగా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. ఇక ఎన్టీఆర్ కథానాయకుడు అతిపెద్ద డిజాస్ట‌ర్. మూవీని ప‌ట్టించుకునే వారే లేకుండా పోయారు. ఒక్క ఎఫ్ 2 మాత్రం సంక్రాంతికి విడుద‌లై పెద్ద హిట్ కొట్టి భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. అయితే ఎఫ్‌2 మూవీ విడుదలకు ముందు ఓ సందర్భంలో అనిల్ రావిపూడి-రామ్ చరణ్ కలిశారట. ఏంటి నా సినిమాకు పోటీగా నీ సినిమా విడుదల చేస్తావా? అని అనీల్ కి రామ్ చ‌ర‌ణ్ వార్నింగ్ ఇవ్వ‌డంతో ఆయ‌న షాక్ అయ్యార‌ట‌. అయితే వెంట‌నే చ‌ర‌ణ్ అనీల్‌ని హత్తుకుని జస్ట్ జోకింగ్. నీ మూవీ బాగా ఆడాలి. ఆల్ ది వెరీ బెస్ట్ అని అన్నార‌ట‌. ఈ విష‌యాన్ని అనీల్ ఓ సంద‌ర్భంలో పంచుకున్నారు.

Exit mobile version