Hudiyo Hudiyo Song Promo | ‘మాస్‌ జాతర’ నుంచి క్లాస్ సాంగ్ రిలీజ్

రవితేజ, శ్రీలీల ‘మాస్ జాతర’ సినిమా నుంచి ‘హుడియో హుడియో’ అనే మెలోడియస్ ప్రోమో సాంగ్ విడుదలైంది. పూర్తి పాట అక్టోబర్ 8న రిలీజ్ కానుంది.

Hudiyo Hudiyo song promo from mass jathara

విధాత : రవితేజ, శ్రీలీల జంటగా కొత్త దర్శకుడు సామజవరగమన ఫేం రైటర్‌ భాను భోగవరపు తెరకెక్కించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మాస్‌ జాతర’ నుంచి మేకర్స్ ప్రోమో సాంగ్ ను విడుదల చేశారు. ‘హుడియో హుడియో’ అంటు ప్రారంభమయ్యే ఈ పాట..నా గుండె గాలిపటమల్లే ఎగిరేసావే.. నీ చుట్టూ పక్కల తిరిగేలా గిరిగిసావే.. నా కంటి రెమ్మల్లో కలలకు ఎరవేశావే.. నీ కంటి చూపులతో కలలను ఉరి తీసావే అంటూ హృద్యంగా సాగింది.

భీమ్ సిసిరోలియో సంగీత సారధ్యంలో మెలోడి ప్రధానంగా చక్కని సంగీత సాహిత్య మేళవింపులతో వినసొంపుతో సాగిన ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటుంది. హేశం అబ్దుల్ వాహద్ ఆలపించిన ఈ పాటకు దేవ్ సాహిత్యం అందించాడు. పూర్తి పాటను ఈ నెల 8న విడుదల చేయనున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31న విడుదల కానుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ లో వేగం పెంచింది. ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ, శ్రీలీల కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య తెరకెక్కిస్తున్నారు.

 

Latest News