Site icon vidhaatha

Samantha|నిర్మాత‌గా మారిన స‌మంత‌…క‌మ్ బ్యాక్ మూవీ ఏంటంటే..!

Samantha|అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఎన్నో బాధ‌లు అనుభవించి ఉన్న‌త స్థాయికి చేరుకున్న స‌మంత ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉంది. తెలుగులోనే కాకుండా అటు తమిళం, హిందీ భాషల్లో నటించి టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక గత కొన్నాళ్లుగా కండరాల వ్యాధి మయోసైటిస్‌ కారణంగా సమంత సినిమాలకుబ్రేక్ ఇచ్చింది. చివ‌రిగా స‌మంత ఖుషి అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ఈ సినిమా రూపొందింది. అయితే స‌మంత ఏ సినిమాతో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంద‌ని అంద‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో క్రేజీ అప్‌డేట్ వ‌చ్చింది.

ఈ రోజు స‌మంత బ‌ర్త్ డే సంద‌ర్భంగా క‌మ్ బ్యాక్ మూవీని ప్ర‌క‌టించింది. సమంత కొన్నాళ్ల క్రితం ‘త్రాలల మూవింగ్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థని స్థాపించి ఆ సంస్థ‌లో మంచి సినిమాలు చేస్తాన‌ని ప్ర‌క‌టించింది. అయితే ఈ రోజు సామ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆమె నిర్మాణంలో రూపొందుతున్న తొలి సినిమా ప్ర‌క‌టిస్తూ టైటిల్ అనౌన్స్ చేశారు. ఇందులో స‌మంత‌నే హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, మూవీకి మా ఇంటి బంగారం అనే టైటిల్ ఖ‌రారు చేశారు. మూవీకి దర్శకుడు, నిర్మాత, క్యాస్టింగ్ ఇతర వివరాలేవీ ప్ర‌క‌టించ‌కుండా కేవ‌లం స‌మంత స్టిల్ మాత్ర‌మే విడుద‌ల చేసి మూవీపై అంచ‌నాలు పెంచారు.

పోస్ట‌ర్‌లో స‌మంత ఎర్ర చీర, నుదుట గాయం, చేతిలో తుపాకీ, క్రూరమైన చూపులు, ఏదో రివెంజ్ కోసం వెళ్తున్నట్టు చూపులు చూస్తుంది. ఈ పోస్ట‌ర్ చూస్తుంటే మొత్తానికి డిఫరెంట్ ఫీలింగ్ అయితే కలిగింది. బంగారం పదాన్ని హైలైట్ చేస్తున్న సామ్ అంతర్గతంగా కథ గోల్డ్ చుట్టూ తిరుగుతుందని అంద‌రు భావిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ క‌నుక స‌క్సెస్ అయితే ఆమె కెరీర్ ఊపందుకుటుంది. ఇది లేడి ఓరియెంటెడ్ మూవీగా రూపొందుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే స‌మంత‌.. వరుణ్ ధావన్ జోడిగా వెబ్ సిరీస్ చేసింది. ఇది అమెరికన్ సిరీస్ సిటాడెల్ వెబ్ సిరీస్‌కు ఇది అఫీషియల్ రీమేక్. రాజ్, డీకే సిటాడెల్‌కు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.

Exit mobile version