Samantha | ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మయోసైటిస్ బారినపడ్డ సమంత.. దాని నుంచి కోలుకునేందుకు చికిత్స తీసుకుంటున్నది. అయితే, సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన చికిత్స గురించి పోస్టులు పెడుతూ వస్తుంటుంది. ఇటీవల ఆమె నెబులైజేషన్‌పై ఓ పోస్టుపెట్టారు. వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన సందర్భంలో నైబులైజేషన్ కోసం ఈ మందులు వాడవచ్చంటూ సమంత సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. దీనిపై పలువురు డాక్టర్‌లో సమంతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమంత పేర్కొన్న మందులువాడితే ప్రాణాలకే ప్రమాదం ఉంటుందంటూ హెచ్చరించారు. సలహాలు ఇచ్చినందుకు నటిని జైలులో పెట్టాలని పలువురు పేర్కొన్నారు. వైద్యశాస్త్రం గురించి ఏం తెలుసని సలహాలు ఇస్తున్నారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సమంత స్పందించింది.
కొన్నేళ్లు నేను తాను రకరకాల మందులు వాడానని.. ప్రతిదీ ప్రయత్నించానని చెప్పింది. అత్యున్నత విద్యార్హతలు ఉన్న నిపుణులు ఇచ్చిన సలహాలను మాత్రమే తాను వాడానని.. ఆ మందుల వాడకంపై సొంతంగా పరిశోధించి కొన్ని విషయాలు తెలుసుకున్నానని చెప్పింది. ఇందులో చాలా రకాల చికిత్సలు ఖరీదు ఎక్కువ అని, ఆ చికిత్సలు చేయించుకునే స్థితిలో ఉన్నందుకు తాను అదృష్టవంతురాలినని చెప్పింది. ఆర్థికభారంతో చికిత్సకు దూరమయ్యే వారి పరిస్థితిపై తాను బాధపడుతుంటానని.. అయితే, దీర్ఘకాలంలో సంప్రదాయ వైద్య విధానాలు తనకు స్వస్థతను అందించలేకపోయాయని చెప్పింది. తాను అవలంభించిన విధానాలు ఇతరులకు మెరుగైన ఫలితాలు అందించాయని.. అందుకే తాను ప్రత్యామ్నాయ వైద్య విధానాల గురించి ఆలోచించానని చెప్పింది. ఈ చికిత్స తనకు సూచించింది డీఆర్డీవోలో 25 సంవత్సరాలు సేవలందించిన ఓ వైద్య నిపుణుడు అని.. ఆయన ఓ క్వాలిఫైడ్ డాక్టర్, పైగా ఎండీ కూడా అని తెలిపింది. సంప్రదాయ వైద్యవిధానాల్లో ఎంతో పరిజ్ఞానం ఉన్న ఆయనే తనకు ప్రత్యామ్నాయ వైద్య విధానం గురించి తెలిపారని చెప్పింది.
కానీ, ఓ వ్యక్తి మాత్రం తన గతం గురించి, నా ఉద్దేశాలపై తీవ్ర పదజాలంతో విమర్శించాడని.. పైగా ఆ వ్యక్తి ఓ డాక్టర్ అని పేర్కొంది. తనకంటే ఆయనకే ఎక్కువ తెలిసి ఉండొచ్చు… కానీ అతను ఉపయోగించిన తీవ్ర పదజాలమే బాగోలేదని.. ముఖ్యంగా, నన్ను జైల్లో పెట్టాలనే మాట తనకు నచ్చలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాను పోస్టు పెట్టింది సెలబ్రిటీగా కాదని.. వైద్య చికిత్స అవసరమైన ఓ వ్యక్తిలా ఆ పోస్టు చేశాని చెప్పుకొచ్చింది. ఆ పోస్టుపై తాను డబ్బు సంపాదించేది ఏమీ లేదిని, ఇంకెవరికో ప్రచారం చేసేదీ లేదని పేర్కొంది. తన వరకు నాకు ఆ వైద్య విధానం ఓ ప్రత్నామ్నాయంలా ఉపయోగపడింది చెప్పానని తెలిపింది. సంప్రదాయ వైద్య విధానాలతో విసిగిపోయి. ఇతర మార్గాల కోసం చూస్తున్నవారికి సలహా ఇచ్చానని.. మందులు పనిచేయనంత మాత్రాన మనం వ్యాధితో పోరాడడం ఆపేస్తామా? తానయితే మానని స్పష్టం చేసింది. ఇప్పటివరకు తాను పొందిన చికిత్సల ద్వారా నేర్చుకున్న అంశాలను ఇతరులకు చెప్పడం ఎందుకంటే.. ఆ విషయాలు వాళ్లకు కూడా ఏమైనా ఉపయోగపడతాయన్న కారణంతోనేనని ఇన్‌స్టాపోస్టులు సమంత వివిరించింది.