Site icon vidhaatha

Samantha | నాగచైతన్యకు సమంత సమన్లు పంపుతోందా..? అసలు కారణం ఏంటంటే..?

Samantha | నాగ చైతన్య, సమంత ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. కొద్ది సంవత్సరాలుగా సజావుగా వీరి కాపురం సాగింది. ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు. మళ్లీ నాగచైతన్య మరో స్టార్‌ హీరోయిన్‌ శోభిత ధూళిపాళను వివాహం చేసుకోనున్నారు. అయితే, సమంత, నాగ చైతన్య కాపురం చేస్తున్న సమయంలో ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లోని ఓ ప్లాట్‌ని కొనుగోలు చేశారు. అందులోనే కొద్దిరోజులు నివాసం ఉన్నారు. డివోర్స్‌ తర్వాత ఇద్దరూ వేర్వేరు ఇండ్లకు షిఫ్ట్‌ అయ్యారు. ప్రస్తుతం, ఆ ఫ్లాట్‌ ఇంకా ఖాళీగానే ఉన్నది. అయితే, శోభితను వివాహం చేసుకున్న తర్వాత.. ఆ ఇంటినే ఆమెకు గిఫ్డ్‌గా ఇవ్వాలని నాగచైతన్య భావిస్తున్నట్లు టాక్‌. ఫ్లాట్‌ను కొనుగోలు చేసిన సమయంలో ఎక్కువగా ఖర్చు చేసింది సమంతనేనని.. ఇందుకు సంబంధించిన ఆధారాలతో త్వరలోనే నాగచైతన్యకు సమన్లు పంపబోతున్నట్లు తెలుస్తున్నది.

ఇద్దరు కొనుగోలు చేసిన ఇంటిని.. నాగచైతన్య.. సమంత అభిప్రాయంతో సంబంధం లేకుండా శోభితకు ఎలా గిఫ్ట్‌గా ఇస్తాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమంత నోటీసులు పంపే విషయంలో ఎంత వరకు నిజముందో ఇప్పటి వరకు తెలియలేదు కానీ.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నది. ఇదిలా ఉండగా.. నాగచైతన్య – శోభిత పెళ్లి పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఇద్దరి పెళ్లి డిసెంబర్‌ 4న వివాహం జరునున్నట్లు తెలుస్తున్నది. వివాహం హైదరాబాద్‌లో జరుగుతుందా..? లేకపోతే డెస్టినేషన్‌ వెడ్డింగా? అన్నది తెలియాల్సి ఉన్నది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నది. హిందీలో సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నది. తెలుగులో చివరిసారిగా ఖుషీ మూవీలో కనిపించింది. నాగచైతన్య ‘తండేల్‌’ మూవీలో నటిస్తున్నది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నది.

Exit mobile version