Sekhar Master| కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన ఎన్నో సినిమాలకి కొరియోగ్రాఫర్‌గా పని చేశారు.చిన్న హీరోల నుండి పెద్ద హీరోల సినిమాలకి కూడా ఆయన పని చేయడం మనం చూశాం. అంతేకాదు శేఖర్ మాస్టర్ బుల్లి తెర మీద అనేక షోలకు జడ్జీగా వ్యవరిస్తూ.. ఇటు యూట్యూబ్‌లో కూడా షార్ట్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రస్తుతం షోలు, సినిమాలతో ఫుల్లు బిజీగా ఉన్న శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆయన ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శేఖర్ మాస్టర్ ఇంట ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా విషాదం చోటు చేసుకుంది. ఆయన వదిన మృతి చెందారు. ఆ విషాదం నుంచి కోలుకోకముందే.. తాజాగా శేఖర్ మాస్టర్ తమ్ముడు మృతి చెందారు.
తన తమ్ముడు మృతి చెందిన విషయాన్ని శేఖర్ మాస్టర్ తన ఇన్‌స్టా హ్యాండిల్ ద్వారార వెల్లడించారు. సోదరుడు చనిపోయిన విషయాన్ని వెల్లడిస్తూ.. ‘‘సుధా నిన్ను చాలా మిస్ అవుతున్నాం.. నేను ఎక్కడికెళ్లినా.. ఏం చేసినా.. నువ్వే గుర్తుస్తోన్నావు. నువ్వు ఇక లేవు.. మమ్మల్ని వదిలి వెళ్లిపోయావనే చేదు నిజాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. నువ్వు మాత్రం ఎక్కడో ఓ చోట ఆనందంగా ఉంటావని భావిస్తున్నాను. ఎప్పటికీ నువ్వు మాతోనే ఉంటావు. మిస్ యూ రా తమ్ముడు..’’ అంటూ తీవ్ర భావోద్వేగంతో శేఖర్ మాస్టర్ పోస్ట్ పెట్టగా, ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక శేఖర్ మాస్టర్ షేర్ చేసిన పోస్ట్ అందరినీ కలిచి వేస్తోంది. ప్రముఖ యాంకర్ అనసూయ దీనిపై స్పందిస్తూ.. ధైర్యంగా ఉండాలని కోరారు. ఇక ఈ విషయం తెలిసి సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్నారు. అయితే తమ్ముడి మృతికి గల కారణాలు ఏంటనేది తెలియరాలేదు. శేఖర్ మాస్టర్ ఢీ డ్యాన్స్ షో ద్వారా కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కొరియోగ్రాఫర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు జడ్జిగా కూడా సత్తా చాటుతున్నాడు. రెగ్యులర్ షోస్,స్పెషల్ షోస్‌లో కూడా శేఖర్ మాస్టర్ కనిపించి సందడి చేస్తుంటాడు. ఎక్కడికి వెళ్లిన కూడా ఆయన సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది.