విధాత: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు స్పందించారు. అక్టోబరు 10న జరగబోయే ఎన్నికల్లో విష్ణు ప్యానల్‌కు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈక్రమంలో మరో పోటీదారు ప్రకాశ్‌రాజ్‌పై కోట కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రకాశ్‌రాజ్ నటనపై నేను వ్యాఖ్యానించను. ప్రకాశ్‌రాజ్‌తో 15 సినిమాల్లో నటించాను. ఏ ఒక్క సినిమాకు ప్రకాశ్‌రాజ్ సమయానికి రాలేదు. ‘మా’ ఎన్నికల్లో సభ్యులంతా ఆలోచించి ఓటు వేయాలి. ‘మా’ అధ్యక్షడిగా పోటీ చేసే అర్హత మంచు విష్ణుకు ఉంది’’ అని కోట వ్యాఖ్యానించారు