Shruti Hassan| కమల్ హాసన్(Kamal Hassan) గారాల పట్టి శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్చి(gabbar Singh)త్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న శృతి టాలీవుడ్‌లో మంచి చిత్రాలలో నటించింది. అనగనగా ఓ ధీరుడు, సెవెన్త్ సెన్స్ , ఓ మై ఫ్రెండ్ వంటి సినిమాలు ఆమెకు నిరాశనే మిగిల్చిన పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ మాత్రం ఆమె కెరీర్‌ని మార్చేసింది.ఈ సినిమా తర్వాత శృతికి తెలుగులో స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశం కలిగింది. మహేశ్ బాబుతో శ్రీమంతుడు, అల్లు అర్జున్‌తో రేసుగుర్రం(Race Gurram)వంటి వరుస హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా మారిన శృతి హాసన్ తమిళం, హిందీ భాషలలోను వరుస ఆఫర్స్ దక్కించుకుంది. మరోవైపు మధ్యలో సింగర్‌గా, కంపోజర్‌గా తన సత్తా చాటుతూ వచ్చేది.
అయితే శృతి హాసన్ కెరీర్ పరంగా బాగానే ఉన్నా ఆమె ఎఫైర్స్ విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ అమ్మడు ధనుష్(Dhanush)తో కొన్నాళ్ల పాటు ప్రేమాయణం సాగించినట్టు ప్రచారం నడిచింది. దీనిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే శృతి హాసన్ మన దేశంకి సంబంధించిన అబ్బాయిలనే కాక ఇతర దేశస్తులతో కూడా ఎఫైర్స్ నడుపుతుండడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలోను శృతి చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన పలు విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది. ముందు మైఖేల్ కోర్సలే(michael corsale) అనే వ్యక్తితో ప్రేమాయణం కొనసాగించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ఈ భామ డేటింగ్ చేసింది. ఈ జంట ముంబైలో కాపురం పెట్టినట్లుగా వార్తలు సైతం వచ్చాయి. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ జంట విడిపోయినట్లుగా తెలుస్తోంది.
అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో శృతి హాసన్ తన డేటింగ్ లపై స్పందించింది. తన పార్ట్‌నర్ లో ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పడంతోపాటు గతంలో డేటింగ్ లో తనకు ఎదురైన కొందరు వ్యక్తుల గురించి కూడా చెప్పుకొచ్చింది. డేటింగ్(Dating) కు వెళ్లినప్పుడు అమ్మాయిలకు అబ్బాయిలు ఖర్చు పెడతారు . కాని నా విషయంలో మాత్రం అది రివర్స్ అయిందని ఈ ఇంటర్వ్యూలో శృతి హాసన్(Sruthi Hassan) చెప్పింది. కొందరు తన దగ్గర డబ్బు బాగా ఉందంటూ తనతోనే ఖర్చు పెట్టించారని శృతి చెప్పుకురావడం కొసమెరుపు. ఖర్చు పెట్టడం ప్రేమలో భాగంగా తాను భావించినా.. దీని వల్ల తాను గుణపాఠం నేర్చుకున్నట్లు కూడా శృతి చెప్పింది. మూడు నెలల తర్వాత మనం ఇన్నిసార్లు బయట భోజనం చేశాం కదా, నువ్వెప్పుడూ బిల్ ఇవ్వలేదు అని నేను అంటే..నీ దగ్గర చాలా డబ్బు ఉంది కదా అని వాళ్లు అనేవారు. అని శృతి హాసన్ స్పష్టం చేసింది.