Site icon vidhaatha

Sirish Bharadwaj| శిరీష్ భ‌ర‌ద్వాజ్ రెండో భార్య ఎవ‌రు.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Sirish Bharadwaj| చిరంజీవి చిన్న కూతురు శ్రీజ 2007లో శిరీష్‌ భరద్వాజ్ అనే వ్య‌క్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలకు తెలియకుండా ఆర్య సమాజ్ లో జరిగిన ఈ వివాహం అప్పట్లో ఎంత పెద్ద దుమారం రేపిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే ఈ ఇద్ద‌రు క‌లిసి ఉంటార‌ని అనుకున్నా కూడా వీరి కాపురం ఎక్కువ రోజులు నిలవలేదు. మనస్పర్థలు రావడంతో 2011లో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే ఆ స‌మ‌యంలో శ్రీజ‌… శిరీష్ భ‌ర‌ద్వాజ్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. అదనపు కట్నం కోసం శిరీష్‌ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని పోలీసుల‌కి ఫిర్యాదు చేసింది. అయితే శ్రీజ నుండి విడిపోయిన త‌ర్వాత శిరీష్ భరద్వాజ్ 2019లో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ విహనను ‌వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారు చెన్నైలోనే స్థిరపడ్డారు.

అయితే లంగ్స్ స‌మ‌స్య వ‌ల‌న ఈ రోజు శిరీష్ భ‌ర‌ద్వాజ్ ఈ రోజు క‌న్నుమూసారు. దీంతో ఆయ‌న రెండో భార్య గురించి తెలుసుకునేందుకు అందరు ఆసక్తి చూపుతున్నారు. శిరీష్‌ రెండో పెళ్లి చేసుకున్న యువతి పేరు విహన కాగా, ఆమె డాక్ట‌ర్‌గా ప‌ని చేస్తుంది.వీరిద్ద‌రిది పెద్ద‌లు కుదిర్చిన సంబంధం కాగా, కొన్నాళ్లుగా చెన్నైలో నివాసం ఉంటున్నారు. అయితే కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ వ‌చ్చిన శిరీష్ ఇలా హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డంతో ఆయన రెండో భార్య తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఆయ‌న ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని ప‌లువురు ప్రార్ధిస్తున్నారు.

ఇక శ్రీజ నుండి విడిపోయాక శిరీష్ భ‌ర‌ద్వాజ్ రాజ‌కీయాల‌లో యాక్టివ్‌గా మారాడు. బీజేపీలో యాక్టివ్‌గా ఉంటూ శిరీష్ భ‌ర‌ద్వాజ్ కొన్నాళ్ల‌పాటు చురుగ్గా ప‌ని చేశాడు. అయితే అనారోగ్యం వ‌ల‌న రాజ‌కీయాలకి కూడా దూర‌మ‌య్యాడు. అయితే శిరీష్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూసాడు. ఈ విష‌యాన్ని ముందుగా ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించలేదు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాని శిరీష్‌ బంధువులు, స‌న్నిహితులు, మీడియా వాళ్లు అతడి మరణ వార్తను సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించి సంతాపం తెలిపారు. కాంట్ర‌వ‌ర్షియ‌ల్ న‌టి శ్రీరెడ్డి కూడా త‌న ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా శిరీష్ భ‌ర‌ద్వాజ్‌కి సంతాపం తెలిపింది.

Exit mobile version