ANR National Award 2024 – అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు, 2024వ సంవత్సరానికి గానూ, మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)ని వరించింది. ఈ అవార్డును చిరంజీవికి ప్రదానం చేయడానికి ది గ్రేట్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) ప్రత్యేకంగా హైదరాబాద్ విచ్చేసారు. ఎంతోమంది టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుక ఆద్యంతం కన్నులపండువగా జరిగింది. ఈ సందర్భంగా అమితాబ్, చిరంజీవి, నాగార్జున కీలక ప్రసంగాలు చేసారు.
చిరంజీవి తన ధన్యవాద ప్రసంగం(Thanks Speech)లో మాట్లాడుతూ, “సినిమా పరిశ్రమలో నేను తొలుత రచ్చ గెలిచాను. నా ఇల్లు అనుకునే పరిశ్రమలో నాకు ఆ అవకాశం టాలీవుడ్ వజ్రోత్సవాల(Tollywood Diamond jubilee Celebrations 2007) సమయంలో వచ్చింది. లెజండరీ పురస్కారం(Legendary Award) ప్రదానం చేయబోయారు. ఆ సమయంలో చాలా ఆనందమేసి ధన్యుణ్ని అనుకున్నా. కానీ ఆ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కొందరు హర్షించని ఆ సమయంలో ఆ పురస్కారాన్ని తీసుకోవడం సముచితం అనిపించలేదు. అందుకే ఆ రోజు ఆ అవార్డుని ఓ క్యాప్సుల్ బాక్స్‌లో పడేసి.. నాకు అర్హత ఎప్పుడు వస్తుందో అప్పుడు తీసుకుంటాను అని చెప్పాను. అంటే ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఇప్పుడు పద్మవిభూషణ్(Padma Vibhushan) సహా ఎన్ని అవార్డులు వచ్చినా ఆ అసంతృప్తి ఇంకా మిగిలే ఉండేదని, ఈ రోజు.. ఏఎన్నార్ అవార్డును అందుకున్న రోజున ఇప్పుడు అనిపిస్తోంది.. ‘నేను ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను’” అని చాలా భావోద్వేగానికి గురయ్యారు చిరంజీవి.
2007లో జరిగిన తెలుగు చలనచిత్ర వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవికి లెజండరీ అవార్డు ప్రదానం చేయడం వివాదాస్పదంగా మారింది. నటుడు, నిర్మాత మోహన్‌బాబు(Mohan Babu) బహిరంగంగానే దీనిపై విమర్శలు(Criticised) చేసారు. మోహన్‌బాబు ఆ అవార్డు తనకు దక్కడం సముచితం అని భావించారు. చిరంజీవి ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. మోహన్‌బాబుకు ఇటువంటి రచ్చచేయడం కొత్త కాకపోయినా, చిరంజీవి అప్పుడు షాక్ తిన్నాడు. దాంతో అక్కడికక్కడే చిరంజీవి తనకొచ్చిన అవార్డును టైమ్ కాప్యుల్ లో వేసేశారు. ‘ఈ అవార్డుకు అర్హత పొందినప్పుడే దీన్ని అందుకొంటాను’ అంటూ ఆవేశంగా మాట్లాడి, లెజెండరీ పురస్కారం తిరస్కరించారు(Rejected).
నిజానికి మోహన్‌బాబు చిరంజీవి కంటే సీనియరే అయినా, దేంట్లోనూ చిరంజీవితో సరితూగే స్థాయి లేదు. అహంకారం(Arrogance) ప్రదర్శించడంలో అందెవేసిన చెయ్యి అయిన మోహన్‌బాబు, అప్పట్లో తన సినిమాలు అల్లుడుగారు, అసెంబ్లీరౌడీ, రౌడీగారి పెళ్లాం వరుసగా సూపర్హిట్టయ్యే సరికి ఓ పత్రిక ఇంటర్వ్యూలో తెలుగు సినీ పరిశ్రమలో నేనే నెంబర్ వన్(I am No.1) అని స్వయంగా ప్రకటించుకున్నారు.
ఆ గుర్తింపే నేడు లెజండరీ అమితాబ్ కూడా తనను తెలుగు సినీ పరిశ్రమ సభ్యుడిగా గుర్తించండని అనేలా చేసింది.