Sasimadhanam | కడుపుబ్బా నవ్వించే సోనియా సింగ్‌ రొమాంటి‌క్‌ వెబ్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?

Sasimadhanam | ఇటీవల కాలంలో ఓటీటీలకు ఆదరణ పెరుగుతున్నది. ప్రస్తుతం థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలకన్నా ఓటీటీల్లోనే ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. ఓటీటీల్లో ఎక్కువ హారర్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీలు చూసేందుకు ఎక్కువగా ఆడియన్స్ ఇష్టపడుతున్నారు.

  • Publish Date - July 2, 2024 / 11:30 AM IST

Sasimadhanam | ఇటీవల కాలంలో ఓటీటీలకు ఆదరణ పెరుగుతున్నది. ప్రస్తుతం థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలకన్నా ఓటీటీల్లోనే ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. ఓటీటీల్లో ఎక్కువ హారర్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీలు చూసేందుకు ఎక్కువగా ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. ఇది గమనించిన ఓటీటీలు ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్, మర్డర్ మిస్టరీ కంటెంట్ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇవి మంచి హిట్‌ను సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో రొమాంటిక్‌ కామెడి వెబ్‌ సిరీస్‌ ఓటీటీలోకి వచ్చేస్తున్నది. అదే శశి మధనం. తనదైన డైలాగ్స్‌తో అభిమానుల్లో క్రేజ్‌ పెంచుకున్న సోనియా సింగ్‌ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నది.

పవన్‌ సిద్ధు, కీర్తి, రూపలక్ష్మి, కృతిక, అశోక్‌ చంద్ర, కేశవ్‌ దీపక్‌, అవంతి దీపక్ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ వెబ్‌ సిరీస్‌కు వినోద్‌ గాలి దర్శకత్వం వహించారు. ఫుల్‌ లెత్‌ కామెడీ ఎంటర్‌నైటర్‌గా ఈ వెబ్‌సిరీస్‌ రాబోతున్నది. ఇటీవల విడుదలైన టీజర్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకున్నది. ఆద్యాంతం నవ్వులు పూయించగా.. దాంతో సిరీస్‌పై అంచనాలు పెరిగాయి. ఇక ఈ వెబ్‌ సిరీస్‌ ఈ నెల 4న స్ట్రీమింగ్‌ కాబోతున్నది. ప్రముఖ ఓటీటీ ఛానెల్‌ ఈటీవీ విన్‌ ఈ వెబ్‌సిరీస్‌ను స్ట్రీమింగ్‌ చేయబోతున్నది. దాడుగు మూతలు దండాకోర్‌.. ఎక్కడి ప్రేమికులు అక్కడే గప్‌చుప్‌ అంటూ స్ట్రీమింగ్‌ డేట్‌ను రిలీజ్‌ చేసింది.

 

Latest News