Sravana Bhargavi|ఎట్ట‌కేల‌కి హేమచంద్ర‌, శ్రావ‌ణ భార్గ‌వి విడాకుల‌పై వ‌చ్చిన క్లారిటీ.. !

Sravana Bhargavi| ఇటీవ‌లి కాలంలో సెలబ్రిటీల విడాకుల వార్తలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. స‌మంత‌, నాగ చైత‌న్య డివో

  • Publish Date - April 24, 2024 / 06:58 PM IST

Sravana Bhargavi| ఇటీవ‌లి కాలంలో సెలబ్రిటీల విడాకుల వార్తలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. స‌మంత‌, నాగ చైత‌న్య డివోర్స్ త‌ర్వాత చాలా మంది జంట‌లు విడాకులు తీసుకున్నారు. ఇక‌పోతే గ‌త కొద్ది నెల‌లుగా శ్రావ‌ణ భార్గ‌వి, హేమచంద్ర విడాకుల గురించి నిత్యం నెట్టింట అనేక వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉన్నాయి. అయితే వారి బంధం గురించి మాత్రం ఎలాంటి క్లారిటీ అయితే రావ‌డం లేదు. 2013వ సంవత్సరంలో హేమ‌చంద్ర‌, శ్రావ‌ణ భార్గ‌వి వివాహం చేసుకోగా వీరికి శిఖర చంద్రిక అనే కూతురు జన్మించింది. ఆ పాప 2016వ సంవత్సరంలో జన్మించగా అప్పుడు శ్రావణ భార్గవి కెరీర్ కాస్త డ‌ల్ అయింది. అయితే హేమచంద్ర మాత్రం వ‌రుస అవ‌కాశాల‌తో ముందుకు సాగాడు.

అయితే వీరిద్ద‌రి ప‌రిచ‌యం ప్రేమ ఆస‌క్తిక‌రంగా సాగింది. ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇటీవ‌ల విడిపోయారంటూ ప్ర‌చారం సాగుతుంది. గత ఏడాది వీరిద్దరి విడాకుల రూమర్లు దావానంలా వ్యాప్తి చెందాయి. కానీ హేమచంద్ర, శ్రావణ భార్గవి నోరు విప్పి ఖండించలేదు. ఒకానొక సందర్భంలో రూమర్లు ఎక్కువ అవ్వడంతో శ్రావణ భార్గవి, హేమచంద్రలు పరోక్షంగా స్పందించారే త‌ప్ప డైరెక్ట్‌గా మాత్రం మాట్లాడ‌లేదు. అయితే కొంతకాలంగా హేమ‌చంద్ర‌, శ్రావ‌ణ భార్గ‌వి కలిసి క‌నిపించ‌డం అనేది జ‌ర‌గ‌డం లేదు. సోష‌ల్ మీడియాలో వీరిద్ద‌రు విడివిడిగా పిక్స్ షేర్ చేస్తున్నారు త‌ప్ప క‌లిసి కనిపించింది లేదు. అయితే తాజాగా శ్రావణ భార్గవి సమ్మర్ వెకేషన్ వెళుతున్నట్లు తన కూతురితో కలిసి లకేజ్ బ్యాగ్‌తో ఉన్న ఫొటోను సింగర్ షేర్ చేసింది.

ఇక ఇది చూసిన నెటిజ‌న్స్ శ్రావ‌ణ భార్గ‌వి ఎక్క‌డ‌, మీరు విడిపోయారా.. క‌లిసి ఉంటే బాగుండేది క‌దా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక `సరిగమప` మంచి గుర్తింపు తెచ్చుకున్న హేమ చంద్ర, శ్రావ‌ణ భార్గ‌వి 2012డిసెంబర్‌ 9న వీరి ఎంగేజ్‌మెంట్‌ జరగ్గా, 2013 ఫిబ్రవరి 14న వివాహం జరిగింది. వీరికి ఓ పాప కూడా ఉంది. ఇటీవ‌ల శ్రావ‌ణ భార్గ‌వి రెండో పెళ్లికి సంబంధించి ప‌లు రూమ‌ర్స్ కూడా నెట్టింట హ‌ల్ చ‌ల్ చేశాయి. అయితే వాటిని ఆమె అభిమానులు ఖండించారు. అవ‌న్నీ అవాస్త‌వాలు అంటూ తీర్పునిచ్చారు.

Latest News