Site icon vidhaatha

Sudheer|అంద‌రి ముందే ఆ అమ్మాయికి ప్ర‌పోజ్ చేసిన సుధీర్.. ర‌ష్మీకి హ్యాండ్ ఇచ్చిన‌ట్టేనా?

Sudheer| బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి సుడిగాలి సుధీర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.మేజిక్ షోలు చేస్తూ.. ఆ తర్వాత కమెడియన్ గా మారిన సుడిగాలి సుధీర్ హీరోగాను ప‌లు సినిమాలు చేశాడు. ఇక తిరిగి బుల్లితెర‌కి వ‌చ్చి హోస్ట్‌గా సంద‌డి చేస్తున్నాడు. అయితే సుధీర్…. పదేళ్ల పాటు యాంకర్ రష్మితో లవ్ ట్రాక్ సాగించి విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆహాలో సర్కార్ అనే షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అలానే ఫ్యామిలీ మ్యాన్ అనే షోని కూడా హోస్ట్ చేస్తున్నాడు. ఇలా బుల్లితెరపై, వెండితెరపై కనిపిస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్న సుధీర్ తాజాగా ఓ అమ్మాయికి లైవ్‌లో ప్ర‌పోజ్ చేశాడు.


టీవీ షోలో ‘కాలాలు కళ్లారా చూసేను లే’ పాటకు సుధీర్ సూపర్బ్​గా డ్యాన్స్ చేశారు. రొమాంటిక్ సాంగ్​కు తగ్గట్లుగా స్టెప్స్ వేసి అల‌రించాడు. ఇక‌ ఆయనతో ఓ అమ్మాయి ఈ పాటలో అదరగొట్టింది. బ్లూ కలర్ శారీలో మెరిసింది. ఆ అమ్మాయికి ఫ్లవర్స్ ఇచ్చి సుధీర్ ప్రపోజ్ చేయడం, ఆమెతో చేసిన డ్యాన్స్ హైలైట్​గా నిలిచాయి. అయితే ఆమె ఫేస్ మాత్రం చూపించ‌చ‌క‌పోవ‌డంతో అసలు ఎవరీ అమ్మాయి? ఆమెకు సుధీర్​కు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? అనే చర్చ నడుస్తోంది. ఒకవేళ షో కోసమే అయితే ఫేస్ చూపించేవాళ్లు కదా! సుధీర్ ఏమైనా ఈ షోలో తన లవర్​ను పరిచయం చేశారా? అంటూ నెట్టింట తెగ చ‌ర్చ‌లు జ‌రుపుకుంటున్నారు. మ‌రి త‌ర్వాత ఏమైన క్లారిటీ ఇస్తారా అనేది చూడాల్సి ఉంది.

ఇక సుడిగాలి సుధీర్ అటు సినిమాలు చేస్తూనే ఇటు బుల్లితెర‌పై కూడా తెగ సంద‌డి చేస్తున్నాడు. ఇక సుధీర్ డ్యాన్స్ చేసిన షోలో న్యాచురల్ స్టార్ నాని స్పెషల్ గెస్ట్​గా పాల్గొన్నారు. ఆది, సుధీర్ కలసి ఫుల్ కామెడీతో ఆకట్టుకున్నారు. స్టార్ యాంకర్ సుమ కూడా వీళ్లిద్దరిపై పంచులు వేస్తూ ప్ర‌తి ఒక్క‌రిని న‌వ్వించింది. ఆటో రామ్ ప్రసాద్ తదితరులు కూడా ఇందులో సందడి చేశారు. నాని నటించిన ‘సరిపోదా శనివారం’ మూవీ త్వరలో విడుదల కానుంది. ప్రమోషన్స్​లో భాగంగా ఈ షోలో ఆయన మెరిశారు. ఇలా సెల‌బ్రిటీలు అంద‌రు క‌లిసి షోలో తెగ సంద‌డి చేయ‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Exit mobile version