Suhana Khan| అమితాబ్ మ‌న‌వ‌డితో షారూఖ్ ఖాన్ కూతురు డేటింగ్.. అడ్డంగా దొరికేసారుగా..!

Suhana Khan| సినిమా ఇండ‌స్ట్రీలో ప్రముఖుల మ‌ధ్య రిలేష‌న్ షిప్ ఏర్ప‌డ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఎప్పుడు ఎవ‌రి మ‌ధ్య ఎలా ప్రేమ పుడుతుందో మాత్రం అర్ధం కావ‌డం లేదు. గ‌త కొన్ని రోజులుగా షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, అమితాబ్ బచ్చ‌న్ మ‌న‌వ‌డు అగ‌స్త్యా నందా డేటింగ్‌లో ఉన్న‌

  • Publish Date - June 29, 2024 / 08:52 AM IST

Suhana Khan| సినిమా ఇండ‌స్ట్రీలో ప్రముఖుల మ‌ధ్య రిలేష‌న్ షిప్ ఏర్ప‌డ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఎప్పుడు ఎవ‌రి మ‌ధ్య ఎలా ప్రేమ పుడుతుందో మాత్రం అర్ధం కావ‌డం లేదు. గ‌త కొన్ని రోజులుగా షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, అమితాబ్ బచ్చ‌న్ మ‌న‌వ‌డు అగ‌స్త్యా నందా డేటింగ్‌లో ఉన్న‌ట్టు జోరుగా ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి. ఆ ప్ర‌చారాల నేప‌థ్యంలో తాజాగా లండన్‌లోని ఓ నైట్ క్లబ్‌లో సుహానా ఖాన్, అగస్త్య నందా పార్టీలో తెగ సంద‌డి చేస్తూ క‌నిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుండ‌గా, ఇది చూసిన వారంద‌రు కూడా వారిద్ద‌రు డేటింగ్‌లో ఉన్న‌ట్టున్నారే అని కామెంట్ చేస్తున్నారు. ‘ది ఆర్చీస్’ చిత్రంలో కలిసి పనిచేసిన స‌మ‌యంలో ఇద్ద‌రు డేటింగ్‌లో ఉన్న‌ట్టు జోరుగా ప్ర‌చారాలు సాగాయి.

ఇప్పుడు నైట్ క్లబ్‌లో వీరిద్దరి వీడియో వైరల్ కావడంతో చర్చకు మరింత ఆజ్యం పోసిన‌ట్టు అయింది. అయితే సుహానా ఖాన్ ఒక సినిమా షూటింగ్ కోసం లండన్ వెళ్లినట్లు తెలుస్తుండ‌గా, అదే సమయంలో ఆమె ఫ్రెండ్ వేదాంత్ మహాజన్ పుట్టినరోజు పార్టీకి హాజరయ్యారు. ఈ పార్టీలో నైసా దేవగన్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అగ‌స్త్యా, సుహానే ఇద్దరు క‌లిసి పార్టీలో క‌న‌ప‌డ‌డంతో వీరిద్ద‌రి డేటింగ్ వ్య‌వ‌హారం ఇప్పుడు చర్చ‌నీయాంశంగా మారింది. ఇక షారూఖ్ ఖాన్ త‌న కూతురికి హీరోయిన్‌గా మంచి హిట్ ఇచ్చేందుకు ఎంతో తాప‌త్ర‌య‌ప‌డుతున్నాడు. ఆమె ‘ది ఆర్చీస్’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

సుహానా ఖాన్‌ ‘కింగ్’ మూవీతో వెండి తెర డెబ్యూ చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రానికి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించగా… రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, సిద్ధార్థ్ ఆనంద్ మార్ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమాపై అధికారిక ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక చాలా ఏళ్ల క్రితమే సుహానా ఖాన్.. తన ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ల‌డంతో అక్క‌డి క‌ల్చ‌ర్‌కి బాగా అల‌వాటు ప‌డింది. ఆమె హాట్ షో చూసి కుర్ర‌కారు బిత్త‌ర‌పోతుంటారు. ఈ విష‌యంలో షారూఖ్ ఖాన్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Latest News