Pradeep| మ‌రి కొద్ది గంట‌ల‌లో అత‌ని సినిమా విడుద‌ల‌.. ఈ లోపే అనుమానాస్ప‌ద మృతి చెందిన ప్రదీప్

Pradeep| ఇటీవ‌ల సినిమా ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక‌రి మృతి గురించి మ‌ర‌చిపోక‌ముందే మ‌రొక‌రు క‌న్నుమూస్తుండ‌డం అభిమానుల‌కి ఏ మాత్రం మింగుడుప‌డ‌డం లేదు. తాజాగా కోలీవుడ్ నటుడు ప్రదీప్‌ కె.విజయన్‌ అనుమానాస్పద స్థితిలో మరణించారు. చెన్నైలోని

  • Publish Date - June 14, 2024 / 06:53 AM IST

Pradeep| ఇటీవ‌ల సినిమా ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక‌రి మృతి గురించి మ‌ర‌చిపోక‌ముందే మ‌రొక‌రు క‌న్నుమూస్తుండ‌డం అభిమానుల‌కి ఏ మాత్రం మింగుడుప‌డ‌డం లేదు. తాజాగా కోలీవుడ్ నటుడు ప్రదీప్‌ కె.విజయన్‌ అనుమానాస్పద స్థితిలో మరణించారు. చెన్నైలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించ‌గా, ఆయ‌న రెండు రోజుల క్రిత‌మే చ‌నిపోయి ఉంటార‌ని పోలీసులు భావిస్తున్నారు.తమిళనాడు పాలవక్కంలోని తన గదిలో బుధవారం (జూన్‌ 12న) మృతి చెందిన‌ట్టు తెలుస్తుంది. రెండు రోజులుగా ప్ర‌దీన్ స్నేహితులు ఆయ‌న‌కి వ‌రుస కాల్స్ చేస్తున్నా కూడా లిఫ్ట్ చేయ‌డం లేదు. దాంతో ప్ర‌దీప్ స్నేహితుడు ఒక‌రు ఆయ‌న ఇంటికి వెళ్లారు. పలు మార్లు తలుపును తట్టాడు. లోప‌ల తాళం వేసి ఉండ‌డం, ఎన్నిసార్లు డోర్ కొట్టినా ప్రదీప్​ త‌లుపు తీయ‌క‌పోవ‌డంతో అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

వెంట‌నే అక్క‌డికి చేరుకున్న పోలీసులు త‌లుపుల‌ని ప‌గ‌ల‌గొట్టి లోప‌లికి వెళ్లి చూడ‌గా, అత‌డు శ‌వ‌మై క‌నిపించాడు. తలకు బలమైన గాయం తగలడం లేదా గుండెపోటు రావడం వల్ల ఆయన మరణించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్‌మార్టం కోసం ప్ర‌దీప్ మృతదేహాన్ని ఆసుప‌త్రికి త‌ర‌లించారు పోలీసులు. అయితే ప్ర‌దీప్ కొద్ది రోజుల క్రితం శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డ్డాడ‌డ‌ని ఆయన స్నేహితుడు పోలీసులకు వివరించారు. అయితే మంచి భవిష్య‌త్ ఉన్న ప్ర‌దీప్ ఇలా క‌న్నుమూయ‌డం చాలా బాధాక‌రం అని ప్ర‌దీప్ మృతి గురించి తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నారు.

విజయ్ సేతుపతి నటించిన మహారాజా చిత్రం (జూన్ 14) న రిలీజ్ కానుంది. ఇందులో ప్ర‌దీప్ కే విజ‌య‌న్ న‌టించాడు. ఆయ‌న న‌టించిన చిత్రం మ‌రి కొద్ది గంటల‌లో విడుద‌ల కానుంది. ఆ స‌మ‌యంలో ఆయ‌న ఇలా చనిపోవ‌డం ప్ర‌తి ఒక్క‌రిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. హాస్య నటుడిగా, విలన్ గా, సపోర్టింగ్ యాక్టర్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రదీప్ విజయన్‌ను తమిళ సినీ పరిశ్రమ ప్రజలు ‘పప్పు’ అని ముద్దుగా పిల‌చుకునేవారు. తెగిడి అనే సినిమాతో పాపులర్ అయిన ప్ర‌దీప్.. ‘టెడ్డీ’, ‘ఇరుంబు తిలై’, ‘తమిళోకు ఎన్ ఒండ్రై అరథూమ్’, ‘లిఫ్ట్’, ‘మనం’, ‘క్లబ్ కెన్నెడీ’, ‘ఆడై’ వంటి అనేక తమిళ చిత్రాలలో నటించాడు.

Latest News